Haniska : యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా పలు చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. చాలా చిన్ని వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. 9 ఏళ్ల వయసులో శకలకబూంబూం సీరియల్‌తో అప్పుడే మంచి పేరు సంపాదించుకుంది. ఆగస్టు 9, 1991 ముంబైలో జన్మించింది. బాలీవుడ్ సినిమాలు క్రిష్, కోయిమిల్గయాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ నటించిన హన్సిక దేశముదురు సినిమాతో సినీఇండస్ట్రీలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది.
దేశ ముదురు సినిమాకి గాను బెస్ట్ డెబ్యూ యాక్టెస్గా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సైతం సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు సేవ కార్యక్రమాలతో కూడా హన్సిక అందరి మనసులు గెలుచుకుంది. పేద పిల్లలకు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు తన పరిధిలో సేవలందిస్తోంది. సుమారు 50 సినిమాల్లో హన్సిక హీరోయిన్గా నటించింది కోలీవుడ్ స్టార్ శింబుతో డేటింగ్ చేసిన హన్సిక్ చిన్న వయసులోనే అదిరేటి లుక్స్ రావడంతో హార్మోన్స్ ఇంజక్ట్ చేసుకుందని అప్పట్లో రూమర్స్ వ్యాపించాయి. శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరు పిచ్చ పిచ్చగా ప్రేమించుకున్నారు. అలాగే ఆమె ఫిజిక్‌లో చాలా మార్పులొచ్చాయి. చాలా బొద్దుగా తయారైంది.

Haniska : వారి సూచనలతో..
ఎద అందాలని మోయేలేకపోతుందనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ సమయంలో హన్సికతో సన్నిహితంగా ఉండేవారు కాస్త తగ్గించుకోమని సలహ ఇచ్చారట. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని సన్నిహితులే చెప్పడంతో హన్సిక చాలా కష్టపడి సన్నబడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు హన్సిక తన వయస్సు 30 సంవత్సరాలకు తగ్గట్టు మంచి పిజిక్ తో కనిపిస్తోంది. ఇప్పటికీ.. సోషల్ మీడియాలో ఆమె అందాల విందుకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. హద్దులు లేని అందాల ఆరబోతతో హన్సిక ఇప్పటికీ రచ్చ చేస్తూనే ఉంది. హన్సిక ఏదైన ఫొటో షేర్ చేసింది అంటే అది కొద్ది క్షణాలలో వైరల్‌గా మారుతుంది.