Heroine: నటి కస్తూరి శంకర్…ఇప్పటి జనరేషన్ వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా తెలియకపోవచ్చు. అయితే గృహలక్ష్మీ సీరియల్ తులసిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇటీవల కాలంలో బుల్లితెరపై సీరియల్స్ లో అలాగే టెలివిజన్ హోస్ట్ గా ఉంటూ పలు సంచనాలకు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు ఈ జనరేషన్ యువత. సీరియల్‌లో ఈమె వేస్తుంది అమ్మ పాత్ర అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఆమె ఒక రెబల్ అని చెప్పాలి.ఎవరు ఏం తప్పు చేసిన, తప్పు మాట్లాడిన ఆమె ఒప్పుకోదు.రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నయనతార.. అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లయింది. సరోగసి ద్వారా వారు పిల్లలకు జన్మనివ్వడంతో ఈ విషయంపై మండిపడింది కస్తూరి.
అలా చేశారేంటి..
బుల్లితెర, వెండితెర, ఓటీటీ ఇలా అన్నింటా హవా నడిపిస్తూ బిజీ బిజీగా ఉన్న కస్తూరి.. నిత్యం సమాజంలోని వివాదాలు, సమస్యలు, విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. సామాజికవేత్తగా, న్యాయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్‌గా నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది. తెలుగుతో పాటూ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కస్తూరి సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కస్తూరి నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా అన్నమయ్యలో నటించింది. ఆ తర్వాత పెద్దగా సందడి చేసింది లేదు. అయితే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే సినిమాలు చేయలేకపోయానని కస్తూరి చెప్పుకొచ్చింది.

అయితే కస్తూరి ఓ 60 ఏళ్ల ముసలి వ్యాపారవేత్తతో సంబంధం పెట్టుకుంది అంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. సెలబ్రెటీల గురించి ఇలాంటి వార్తలు రావడం సహజం అని తాను అలాంటి రూమర్ లను పట్టించుకోనని కస్తూరి వెల్లడించారు. అయితే కస్తూరి తో ఎఫైర్ అంటగట్టిన ఆ ముసలి వ్యాపారవేత్త ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. మోడలింగ్ లోకి ప్రవేశించి సినిమాల్లో సైతం రాణించింది కస్తూరి .ఇక 1991లో సినిమా కెరియర్ ప్రారంభించిన కస్తూరి కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించింది.1992 లో మిస్ మద్రాసుగా ఎంపికయ్యింది. సినిమాల్లో హీరోయిన్ గా రాణించకపోవడంతో ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రల్లో కూడా నటించి ఆ తర్వాత టెలివిజన్ హోస్ట్ గా కూడా మారింది.