Pawan Kalyan : జనసేన పార్టీని పెట్టి దాదాపు 9 ఏళ్లు కావొస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెడతారని ఎవ్వరూ అనుకోలేదు. దానికి కారణం.. అంతకుముందే తన అన్న, చిరంజీవి పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలపడంతో పవన్ మళ్లీ పార్టీ పెడతారని అనుకోలేదు. కానీ.. 2014 లో జనసేన పేరుతో పార్టీని పెట్టారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ.. అటు బీజేపీకి, ఇటు టీడీపీకి రెండు పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఫలితంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ రెండూ అధికారంలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు పదవులు ఇవ్వడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రెండూ రెడీగా ఉన్నప్పటికీ పవన్ మాత్రం అస్సలు వద్దన్నారు.
తనకు పదవులు ఇస్తామన్నా ప్రజల సమస్యలు తీర్చండి.. పదవులు వద్దన్నారు. అంతే కాదు.. ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. కానీ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగారు. చివరకు పవన్ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఒకే ఒక్క సీటు జనసేనకు వచ్చింది. 2014, 2019 ఎన్నికలను వదిలేస్తే.. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచే సీట్లు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. జనసేనకు ఎక్కడ బలముందో చూసుకొని ఆ నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు.

Pawan Kalyan : 2024 లో జనసేనకు పెరగనున్న సీట్లు
వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడే చాన్స్ ఉందని అందరూ అంటున్న నేపథ్యంలో జనసేన సీట్లే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు చంద్రబాబుకు చాన్స్ ఇచ్చారు. ఒక్క చాన్స్ అన్న జగన్ కు చాన్స్ ఇచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ కు ఇచ్చి చూద్దాం అని ఏపీ ప్రజలు అనుకుంటే.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినట్టే. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సీఎం అయితే ఏపీ రామరాజ్యంలా ఉంటుంది అని మెజార్టీ ప్రజలు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం పట్టాలెక్కుతాయని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.