BRS : బీఆర్ఎస్… ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కొత్త పేరు అదే. సీఎం కేసీఆర్.. దసరా సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. అంటే తెలంగాణకే పరిమితం అయిన టీఆర్ఎస్ కాస్త జాతీయ పార్టీగా మారింది. అంటే.. ఇప్పుడు అది అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ అన్నమాట. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు.. సీమాంధ్ర నేతలపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర నేతలు.. తెలంగాణను అన్యాయం చేశారని అన్నారు. ఉమ్మడి ఏపీలో పాలించిన నేతలందరిపై తెలంగాణ నేతలు దుమ్మెత్తిపోశారు.
అందుకే తమకు కూడా సపరేట్ రాష్ట్రాన్ని ఇవ్వండి అంటూ సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా కొన్ని రోజులు ఉద్యమాలు చేశారు. మరికొందరు ఉమ్మడి ఏపీయే ముద్దు అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సీమాంధ్రులను అవమానించారు. అవసరం ఉన్నా లేకున్నా సీమాంధ్రులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆంధ్ర ప్రజలపై కూడా టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారని అందరికీ తెలిసిందే.

BRS : అప్పుడు సీమాంధ్రులను అవమానించి.. ఇప్పుడు సీమాంధ్రలో ఓట్లెలా అడుగుతారు?
ఇప్పుడు జాతీయ పార్టీగా మార్చిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ జెండాను సీమాంధ్రలో ఎలా నాటుతారు. సీమాంధ్రకు కేసీఆర్ ఎలా వెళ్తారు. అక్కడ సీమాంధ్రులను ఎలా ఓట్లు అడుగుతారు అంటూ ఆంధ్రా ప్రజలు అంటున్నారు. తమ పార్టీ కోసం, తమ పార్టీని విస్తరించడం కోసం ఏపీలో ఎలా పర్యటిస్తారు.. ఎన్నికల సమయంలో ఏపీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని ఎలా అడుగుతారు.. అంటూ ఆంధ్రా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నచ్చని సీమాంధ్ర.. ఇప్పుడు ఎలా నచ్చుతుంది. ఇంకా విభజన సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఏపీకి రావాల్సిన హామీలే ఇంకా తీరలేదు. ఇప్పుడు ఎలా ఆంధ్రాలో అడుగుపెడతారో చూడాలి.. అని ఆంధ్రా ప్రజలు అంటున్నారు. చూద్దాం మరి ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ముందడుగు వేస్తుందో?