Post Office : మనదేశంలో పోస్ట్ ఆఫీస్ అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక పోస్ట్ ఆఫీస్ యాజమాన్యం వినియోగదారులకు అనేక రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు పంపించడానికి పరిమితమైన పోస్ట్ ఆఫీస్ లో ఇప్పుడు అన్ని స్కీమ్ లను, సేవలను అందిస్తున్నారు.ఇక ఈ పోస్ట్ ఆఫీస్ లకు దేశంలో కోట్లాదిమంది కస్టమర్స్ ఉన్నారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ లో ఎకౌంటు తీసే ముందు అందులో నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను తీసుకోవాలనుకున్నవారు కచ్చితంగా నామినీ కాలమ్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఖాతాలో జమ చేసిన మొత్తం ను నామినీకి ఇస్తారు.
అయితే చాలామంది ఫామ్ నింపేటప్పుడు నామినీ ఫామ్ నింపకుండా మర్చిపోతున్నారని తరువాత డబ్బు తీసుకోవాల్సిన టైం లో సమస్యలను ఎదుర్కొంటున్నారని పోస్ట్ ఆఫీస్ అధికారులు చెబుతున్నారు.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో నామినీ లేకపోతే ఆ డబ్బులు తిరిగి పొందడం కష్టమని చెప్పాలి. దీనిలో భాగంగా నామినీ లేకుంటే ఐదు లక్షల లోపు మొత్తానికి ప్రత్యేక నిబంధన పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా ఖాతాదారుడు మరణించినప్పుడు వారి ఖాతాలో 5లక్షలు డిపాజిట్ ఉంటే ఆ మరణించిన ఖాతాదారుని యొక్క మరణ ధ్రువీకరణ పత్రాన్ని పోస్ట్ ఆఫీసులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ మొత్తం ను క్లెయిమ్ చేసుకోవడానికి క్లెయిమ్ ఫామ్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అతని నష్టపరిహారం , ఆఫీడబిట్, కేవైసీ, ఆధార్ కార్డు ఇతర వివరాలతో పాటు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Post Office : నామిని లేకపోతే ఏమవుతుంది
దీని తర్వాత అధికారులు మీ అన్ని పత్రాలను తనిఖీ చేసి మీ క్లెయిమ్ ఫాం ను క్రాస్ చెక్ చేస్తారు. ఈ క్లెయిమ్ ను ఆరు నెలల లోపు చేసుకోవచ్చు. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తము ఉంటే … ఖాతాదారుని ఖాతాలో రూ.5 లక్షల కంటే ఎక్కువ డబ్బు జమ అయి ఉన్నట్లయితే మీరు వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం ద్వారా , మీరే ఖాతాదారుని యొక్క నిజమైన వారసుడిగా నిరూపించబడతారు. అలాగే పైన పేర్కొనబడిన పత్రాలు కూడా , అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.