Lakshmi devi : త్వరలో దీపావళి పండుగ రాబోతుంది. దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది లక్ష్మీ పూజను చేస్తారు. ఎందుకంటే దీపావళి పండుగ లక్ష్మీదేవికి అంకితం కాబట్టి. ఇక లక్ష్మీదేవిని సిరిసంపదలను ఇచ్చే దేవతగా పూజిస్తారు. ఎవరికైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వారు సంపన్నమైన మరి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి గల మార్గాలను తెలుసుకొని అనుసరించడానికి ప్రయత్నిస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఆరోజు మీ రాశిి ప్రకారం లక్ష్మీ మంత్రాలను పట్టిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి రాశి వారికి ఒక మంత్రం ఉంటుంది. ప్రతి రాశి వారు ఆ మంత్రాన్ని పటిస్తూ లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవచ్చని పెద్దల నమ్మకం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి : ఓం ఐం క్లీం సౌ:” అనే మంత్రాన్ని ప్రతిరోజు పూయించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. వృషభం : “ఓం ఐం క్లీం శ్రీః” అనే లక్ష్మి మంత్రాన్ని ,జపించడం ద్వారా వృషభ రాశి వారు అప్పుల బాధల నుంచి బయటపడతారు. మిధున రాశి: “ఓం క్లీం ఐం సౌ:” అనే లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా వారి సిరి సంపదలు పెరుగుతాయి.. కర్కాటక రాశి: ఈ రాశి వారు ఓం ఐం క్లీం శ్రీః” , అనే మంత్రాన్ని భక్తితో జంపం చేయాలి. అలాగే ,కర్కాటక రాశి వారు”ఓం హ్రీం లక్ష్మాయ నమః పరమలాక్షావస్థాయ హ్రీం శ్రీం హ్రీం స్వాహా” మంత్రాన్ని కూడా జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. సింహరాశి : “ఓం హ్రీం ఐం సౌ:” అనే మంత్రాన్ని ఈ రాశి వారు మనసులో జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఓం హ్రీం క్రీం మైం నమః సతోవిధానంద్ విగ్రహయే హ్రీం క్రీం స్వాహా” అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండాలి.

కన్యరాశి : కన్య రాశి వారు “ఐం హ్రీం శ్రీ జ్యేష్టలక్ష్మీ స్వయంబువే హీం జ్యేష్టాయై నమః” , అనే మంత్రాన్ని రోజు పఠించాలి. “ఓం శ్రీం ఐం సౌ:” అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండాలి. తులారాశి : తులా రాశి వారు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మి నమః” అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి.వృశ్చిక రాశి : “ఓం గ్లోం శ్రీం అన్నం మహాన్నం మే దేవన్నాతిపతియే మామన్నం ప్రదాభయ స్వాహా శ్రీ గ్లీం ఓం” అనే మంత్రాన్ని ఈ రాశి వారు జపించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం అందుకుంటారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారు ఓం హ్రీం జయాయై నమః అజితమవస్తిదాయై హ్రీం శ్రీం స్వాహా” అనే మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీదేవి సానుకూలత శక్తి లభిస్తుంది.మకర రాశి: మకర రాశి వారు “ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌ:” అనే మంత్రం జపించాలి. అలాగే”ఓం హ్రీం మాయాయై నమః మోహలాక్షావస్థితాయై శ్రీం శ్రీం హ్రీం స్వాహా” అనే మంత్రాన్ని కూడా జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. కుంభరాశి : ఈ రాశి వారు లక్ష్మీదేవిని దృష్టిలో ఉంచుకొని ఓం హ్రీం మాయయే నమః మోహలాక్షావస్తై శ్రీం శ్రీం హిరీం స్వాహా” అనే మంత్రం ని జపించడం ద్వారా మంచి జరుగుతుంది. మీన రాశి :మీన రాశి వారు “ఓం హిరీం జయయే నమః అజితాదమావస్తై హిరీం శ్రీం స్వాహా” అనే లక్ష్మి మంత్రాన్ని జపించడం ద్వారా , వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.