Redmi A1 : రెడ్ మీ ఫోన్స్‌కి మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ విడుదల చేసిన ఫోన్స్‌కి గిరాకీ బాగానే ఉంటుంది. ఇప్పటికే చాలా రెడీ మీ ఫోన్స్ వినియోగదారుల మెప్పు పొందాయి. ఇక సెప్టెంబర్ 6న రెడ్ మీ నుండి రెడ్ మీ ఏ1 ఫోన్ రాబోతుంది. ఇది పూర్తిగా భారత్ లో తయారైంది. పిల్ ఆకారంలో కెమెరా సెటప్ వెనుక భాగంలో కనిపిస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ వెనుక వైపు ప్రీమియం లెదర్ టెక్స్చర్ ఉంటుంది. ఈ ఫోన్ కు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా లీక్ కాలేదు. కాకపోతే తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుంది.
Redmi A1 : రెడ్ మీ ఫోన్స్ హవా..
రెడ్ మీ ఏ 1 సెప్టెంబర్ 6 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో సేల్ ప్రారంభమవుతుందని Xiaomi అనుబంధ సంస్థ ట్విట్టర్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. ఈ ఫోన్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ AI కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కనీసం మూడు రంగులతో లాంచ్ కానున్నట్టు సమాచారం. దీని పొడవు 164.67 మిమీ మరియు వెడల్పు 76.56 మిమీ ఉంటుంది. ఫోన్ 3GB RAMని కలిగి ఉడవచ్చని మరియు ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ చేయవచ్చని సూచించింది. ఈ ఫోన్ తక్కువ ధరకే లభ్యమవుతుందని సమాచారం.

ఇక రెడ్ మీ ప్రైమ్ 11 5జీ ఫోన్ ను సైతం షావోమీ అదే రోజు విడుదల చేయనుందని తెలుస్తోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ వోసీ చిప్ సెట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా ఉంటుంది. ఇందులో 6.58 అంగుళాల డిస్ ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. చూస్తుంటే సెప్టెంబర్ 6న రెడ్ మీ ఫోన్స్ జాతర కనిపించనుందని తెలుస్తుది. ఇక మీరు ఆలస్యం చేయకుండి రెడ్ మీ రిలీజ్ చేస్తున్న ఫోన్స్ పై ఓ లుక్ వేయండి.