iPhone 14 : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోపే మీ ఇంటికి డెలివరీ.. ఇలా బుక్ చేసుకోండి  

Advertisement

iPhone 14 : ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఐఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. ఆ కిక్కే వేరప్ప. కానీ.. ఐఫోన్ బుక్ చేయగానే రాదు కదా. ఐఫోన్ కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాలి. లేదంటే ఐఫోన్ స్టోర్స్ లోకి వెళ్లి కొనుక్కోవాలి. ప్రస్తుతం ఐఫోన్ 14 మార్కెట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఐఫోన్ 13 లాంచ్ అయింది. తాజాగా ఐఫోన్ 14 లాంచ్ అయింది. కానీ.. ఇప్పుడు మీకు ఐఫోన్ 14 కావాలంటే రోజులకు రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు బుక్ చేసిన 30 నిమిషాల లోపే ఐఫోన్ మీ ఇంటికి చేరుతుంది. అలా ఎలా అంటారా? పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.

Advertisement

జొమాటో సబ్ బ్రాండ్ బ్లింకిట్.. యాపిల్ రీసెల్లర్ ప్లాట్ ఫామ్ యూనికార్న్ తో టైఅప్ అయింది. దీంతో బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 14 ను ఆర్డర్ చేసుకుంటే 30 నిమిషాల్లోపే ఇంటికి డెలివరీ చేస్తారు. కాకపోతే ప్రస్తుతానికి ఈ సర్వీస్ ముంబై, ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. బ్లింకిట్ అనేది కిరాణ వస్తువులు, ఇతర సామాన్లు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకునే యాప్. యూజర్ అడ్రస్ కు దగ్గర్లో స్టోర్ ఉంటే.. బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే 30 నిమిషాల్లోనే ఐఫోన్ ను డెలివరీ చేస్తారు. ఈ యాప్ ద్వారా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోను బుక్ చేసుకోవచ్చు.

Advertisement
iphone 14 can be delivered in less than 30 minutes
iphone 14 can be delivered in less than 30 minutes

iPhone 14 : బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోను బుక్ చేసుకోవచ్చు

ఈ ఫోన్లు.. యాపిల్ ఆథరైజ్డ్ రిటైల్ ఔట్ లెట్స్ తో పాటు యాపిల్ ఆన్ లైన్ స్టోర్ లోనూ లభిస్తాయి. ముందుగా బ్లింకిట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఐఫోన్ 14 సిరీస్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14, 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 గా ఉంది. 256 జీబీ వేరియంట్ ధర రూ.89,900 గా ఉంది. 512 జీబీ వేరియంట్ దర రూ.1,09,900 గా ఉంది. ఐఫోన్ 14 ప్రో 128 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900 గా ఉంది. 256 జీబీ వేరియంట్ ధర రూ.1,39,900 గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. ఒక టీబీ వేరియంట్ ధర రూ.1,79,900 గా ఉంది. ఒకవేళ అఫిషియల్ యాపిల్ స్టోర్ లో ఐఫోన్ 14 ను కొనాలనుకుంటే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6000 డిస్కౌంట్ పొందొచ్చు. డిస్కౌంట్ పోను.. ఐఫోన్ 14, 128 జీబీ వేరియంట్ ధర రూ.73,900 కే లభించనుంది.

Advertisement