Jabardasth : జబర్దస్త్ అందాలరాశి వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉల్లితెరపై వర్షకు మంచి క్రేజ్ ఉంది. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలలో నటించిన రాని క్రేజ్ జబర్దస్త్ ద్వారా లభించింది. ఒకసారి జబర్దస్త్ స్టేజ్ మీద బ్లూ సారీలో కనిపించిన వర్ష అప్పటి నుండి ట్రెండ్ అవుతూ వస్తుంది. ఆమె వెరైటీ గొంతు మీద ఎన్ని సెటైర్లు వచ్చిన లేడీ గెటప్ అంటూ చాలామంది కామెంట్ చేసిన జనాలు మాత్రం తనను ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెను అందరూ ఇష్టపడుతూనే వస్తున్నారు. వర్ష ఇమాన్యుల్ ట్రాక్ ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి వీరిద్దరి క్రేజ్ బాగా పెరిగిపోయింది.
బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ జంటకు ఉన్న డిమాండ్ వీరి జంటకు కూడా ఉండడం విశేషం. ఇక వీరిద్దరిని పెట్టి ఈటీవీ ఎన్నో ఈవెంట్లు మరియు పండుగ షో లను కూడా చేసింది. వీరిద్దరి మీదనే షోలను ప్లాన్ చేసే రేంజ్ కు వచ్చారు వర్ష ఇమాన్యుల్.దీంతో వీరి ఓవర్ యాక్షన్ హద్దులు దాటడంతో జనాలు కొంచెం పక్కన పెట్టేసారు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరు చేసే అంగమా అంతా ఇంకా కాదు. ఇంకా జబర్దస్త్ ఫోటోలతో వర్ష సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

అయితే ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వర్ష ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఆమె చేతికి సెలెన్ పెట్టి ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నటుగా కనిపిస్తుంది. అయితే వర్షాకు ఫీవర్ వచ్చిందా లేదా ఇంకేమైనా సీరియస్ అయిందా అనేది తెలియడం లేదు. తన అభిమానులు మాత్రం ఆమె త్వరగా కోలుకొని మరల బుల్లితెరపై కనిపించాలని కోరుకుంటున్నారు. మనం కూడా వర్ష త్వరగా కోలుకోవాలని కోరుకుందాం…