Pawan Kalyan : ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు కదా. ఆయన ఎప్పుడు సినిమాలు తీస్తారో.. ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవ్వరికీ తెలియదు. నిజానికి.. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ మామూల్ది కాదు. ఆయనకు ఒక సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా చాలామంది అభిమానులు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు లేనంత ఫ్యాన్ బేస్ పవన్ సొంతం. కానీ.. ఆయన అప్పుడప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఆయన వెనుకపడి పోతున్నారు. జనసేన పార్టీని స్థాపించి యాక్టివ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా ఆయన అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. పలు విషయాల్లో ఆయన కొన్ని పార్టీలకు మద్దతు ఇస్తూ వచ్చారు. తెలంగాణలోనూ పలు సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అప్పుడప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా పవన్ కళ్యాణ్ పొగిడారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సందర్భంగా పలుసార్లు మంత్రి కేటీఆర్ కూడా వెళ్లి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ బాధ్యత కేవలం తెలంగాణ మాత్రమే కాదు. ఇండియా. అవును.. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని పెట్టిన తర్వాత ఇప్పుడు పార్టీని దేశమంతా విస్తరించాలి.

Pawan Kalyan : ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు పవన్ కళ్యాణ్ తో మద్దతా?
దానికోసం జాతీయ నాయకులతో, ఇతర రాష్ట్రాల ప్రాంతీయ నాయకులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. దానిలో భాగంగానే ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ బలపడటం కోసం ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీతో ఏపీలో బీఆర్ఎస్ జతకట్టబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాన్ మద్దతు చాలా అవసరం. అందుకే.. ప్రగతి భవన్ కు పవన్ కళ్యాణ్ ను త్వరలోనే ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. చూద్దాం మరి.. పవన్ కళ్యాణ్, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏపీలో బలపరుచుతారా? దీనివల్ల జనసేనకు ఏం లాభం.. అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.