Jio : ఎవరికీ తెలియకుండా ఆ 10 ప్లాన్ లను ఎత్తేసిన జియో… అసలు ఏమైంది అంటే ….?

Advertisement

Jio : దేశంలోని టెలికామ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సంస్థ రిలయన్స్ జియో. ఇక ఈ సంస్థ తన యూజర్ల కోసం విభిన్నమైన ప్లాన్లను ఇస్తుంది. అనేక రకాల బెనిఫిట్స్ తో డిఫరెంట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇంకా దీనిలో భాగంగా ఈ మధ్యకాలంలో కొత్త ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ఓటిటి ప్లాట్ఫామ్స్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను చాలా తీసుకుని వచ్చింది జియో. భిన్నమైన వ్యాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రీప్షన్ ను పొందే ప్లాన్స్ ను తీసుకొచ్చింది. అయితే వీటిలోనే చాలా ప్లాన్స్ ను హఠాత్తుగా ఎత్తేసింది రిలయన్స్ జియో. సమాచారమే ఇవ్వకుండానే ఈ పది ప్లాన్స్ ను సడన్ గా తీసేసింది జియో. ప్రస్తుతం ఈ ప్లాన్సు యూజర్లకు అందుబాటులో లేవు.

Advertisement

అయితే జియో తొలగించిన ఆ 10 ప్లాన్స్ ఏంటో మనం తెలుసుకుందాం.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో ప్రీపెయిడ్ ఫ్యాన్లు చాలా అందించేది రిలయన్స్ జియో. అయితే అందులో పది ప్లాన్లు తీసేయగా ప్రస్తుతం రెండు ప్లాన్సు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.రూ. 333, రూ.499, రూ.583, రూ. 601, రూ.783, రూ.799, రూ.1,099 ,ప్రస్తుతం ఈ ప్లాన్సు జియో వెబ్ సైట్ , మై జియో యాప్ లో లేవు. అలాగే డేటా యాడ్ ప్లాన్స్ అయినా రూ.151, రూ.555, రూ.659, ప్లాన్స్ ను కూడా జియో తీసేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందే ఈ ప్లాన్ లను జియో హఠాత్తుగా ఎత్తేసింది.

Advertisement
Jio lifted those 10 plans without knowing anyone
Jio lifted those 10 plans without knowing anyone

ఈ ఫ్యాన్స్ ను ఎంచుకునే అవకాశం యూజర్లకు లేకుండా పోయింది. అయితే ఈ ప్లాన్స్ ను జియో శాశ్వతంగా తొలగించిందా లేదా మరో కొత్త బెనిఫిట్స్ తో తీసుకురానుందా వేచి చూడాలి.అయితే ఇప్పుడు ప్రస్తుతం రూ.2,999 మరియు రూ.3,199 ప్లాన్లు మాత్రమే జియో వెబ్సైట్ మరియు మై జియో యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రెండు ప్లాన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లను కలిగి ఉంటాయి. మొత్తానికి ఏ సమాచారం లేకుండా మొబైల్ సబ్ స్క్రిప్షన్ తో కూడిన ప్లాన్స్ ను తీసేసింది. మరి జియో వీటిని మళ్లీ తీసుకొస్తుందో లేక శాశ్వతంగా తీసేస్తుందో చూడాలి.

Advertisement