KCR : ఏపీ లో ‘ఆ రెండు’ స్థానాల్లో కే‌సీఆర్ బీఆర్ఎస్ పోటీ..!!

Advertisement

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తమ సేవలను విస్తరించేందుకు తెగ కృషి చేస్తోంది. ముందుగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించబోతున్నారు. అందుకోసం కేసీఆర్ ఏకంగా తన అభిమాన నాయకుడు ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. బీఆర్ఎస్ ను విస్తరించే క్రమంలో టీడీపీని పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఫార్ములాను అనుసరించారో కేసీఆర్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ అప్పట్లో ఏ ఎన్నికల్లో అయినా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు. తన సొంత నియోజకవర్గం కంటే కూడా ఇతర నియోజకవర్గాల్లోనే ఎన్టీఆర్ పోటీ చేసేవారు.

Advertisement

ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఫాలో అవుతారా అనిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కారణం.. అది కూడా దూరంగా ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేయడం వెనుక పెద్ద రీజన్ ఉంది. వేర్వేరు చోట్ల ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ ప్రభావం చుట్టు పక్కన ఉన్న నియోజకవర్గాలపై కూడా పడుతుంది. ఆ పార్టీ ప్రభావం ఆయా నియోజకవర్గాల్లోనూ పడుతుంది కాబట్టి ఎన్టీఆర్ అప్పుడు అలా వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు. అదే పంథాను సీఎం కేసీఆర్ ఫాలో అవాలని అనుకుంటున్నారట. బీఆర్ఎస్ తరుపున ఏపీలో కేసీఆర్ రెండు చోట్ల బరిలోకి దిగాలని భావిస్తున్నారట.

Advertisement
kcr brs party to contest in two places in ap
kcr brs party to contest in two places in ap

KCR : ఎన్టీఆర్ లెక్క వేరు.. కేసీఆర్ లెక్క వేరు

తనకు బలం ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, కడపలో తను పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ తనకు వీలు పడకపోతే తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర అంతా వెలమ సామ్రాజ్యమే కదా. తన మూలాలు కూడా ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. అందుకే.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించడమూ.. లేక తనే బరిలోకి దిగడమో చేయనున్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయబోతోందన్నమాట. బీఆర్ఎస్ పార్టీ వల్ల.. మరి వైసీపీకి నష్టం చేకూరుతుందా? లేక లాభం చేకూరుతుందా? ఏపీలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement