Krishnam Raju: రెబల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణం రాజు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన . విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. నిన్న (ఆదివారం) ఆయన మరణించారని తెలిసి యావత్ సినీ లోకం కృంగిపోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు గుండెపోటుతో కన్నుమూశారు. అయితే తన పెద్దనాన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రభాస్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్లి ఆయనని పలకరించారు. అయితే ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన కొద్ది గంటలకే కృష్ణం రాజు మరణించారట.
Krishnam Raju బాధతో చెప్పక తప్పలేదు..!
తన పెద్దమ్మ శ్యామలాదేవిని హాస్పిటల్లోకి రానివ్వలేదట ప్రభాస్ . కృష్ణం రాజు పరిస్థితి అంత దారుణంగా ఉందని ముందుగానే ఆమెకు కృష్ణంరాజును ఐసీయూలో చూపించి పంపించేసారట. ఇక కృష్ణం రాజు చనిపోయాడని ప్రభాస్ మొదటి చెప్పింది కూడా శ్యామల దేవికే నట . శ్యామలా దేవికి ఈ విషయం చెప్పే సాహసం ఎవరు చేయకపోగా, ప్రభాసే ధైర్యం చేసుకొని చెప్పాడట. అయితే తన పెద్దనాన్న మరణ వార్తతో ప్రభాస్ చాలా కుంగిపొయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కృష్ణంరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయనతో ఉన్న గొప్ప అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే సీనియర్ దర్శక తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

పచ్చకామెర్లు వచ్చిన వారికి పసరమందు ఇవ్వడం అనేది కృష్ణంరాజు గారికి వంశపారం పర్యంగా వచ్చిందని తమ్మారెడ్డి చెప్పారు. అందుకే దాన్ని వదలకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి పచ్చకామెర్లు వచ్చిన కృష్ణం రాజు గారే మందు పంపించే వారని ఆయన తెలిపారు. ఇది చాలామందికి తెలియని విషయమని తమ్మారెడ్డి అన్నారు. తన అన్నయ్య కృష్ణం రాజుకు మంచి స్నేహితుడని.. ఆ చనువుతోనే నన్ను కూడా ఒరేయ్ ఇలా రా.. అనే ఆయన పిలిచేవారని చెప్పారు. చివరి వరకు అదే చనువుతో ఉన్నారని తెలిపారు తమ్మారెడ్డి.