Vizag : వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి.. సముద్రం. దాని వల్లే వైజాగ్ అంతగా డెవలప్ అయింది. డెవలప్ అయిన ప్రాంతాల్లో భూముల కుంభకోణాలు కామనే కదా. వైజాగ్ లోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు పెద్దగా లేవు కానీ.. ఎప్పుడైతే ఉమ్మడి ఏపీ నుంచి ఏపీ విడిపోయిందో అప్పటి నుంచి వైజాగ్ లో కొన్ని భూములకు సంబంధించిన కుంభకోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణం.. ఏపీలో ఉన్న ఏకైక పెద్ద సిటీ వైజాగ్ మాత్రమే. చుట్టూ సముద్రం. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్లు స్థిరపడిన ప్రాంతం. విశాఖపట్టణంలో అన్ని వసతులు ఉంటాయి. అన్ని రకాల వారు స్థిరపడ్డారు.
అందుకే.. వైజాగ్ లో కూడా భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో రాజకీయ నాయకుల కళ్లు వాటి మీద పడింది. చివరకు దేవుడి మాన్యాలను కూడా వదలడం లేదు. దేవస్థానాలకు సంబంధించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారు. సింహాచలం దేవస్థానానికి సంబంధించిన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మన్సాస్ వ్యవహారం కూడా అంతే కదా. వీటిని పక్కన పెడితే ఇప్పుడు దసపల్లా భూముల వ్యవహారం తెరమీదికి వచ్చింది. రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు ఆ నేత. ఆయన వైసీపీకి చెందిన నేత అని సమాచారం. ఆ నేత కన్ను.. ఏకంగా దసపల్లా భూముల మీద పడిందట. కానీ.. చివరకు భూముల పంపకాల్లో ఏదో తేడా కొట్టిందట. దీంతో భూముల కుంభకోణం జరుగుతోందని వైసీపీ నేతలే మీడియాకు లీకులిచ్చారు.

Vizag : వైసీపీ నేత కన్ను ఆ భూముల మీద పడిందా?
దీంతో అసలు బండారం బయటపడింది. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ నేతలు ఇలా రాష్ట్రం మీద పడి తింటూ పోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి. వైసీపీ గెలవాలని.. దాని కోసం ఓవైపు సీఎం జగన్ ఎంతో కష్టపడుతుంటే మరోవైపు వైసీపీ నేతలు మాత్రం భూకుంభకోణాలు, ఆ కుంభకోణాలు ఈ కుంభకోణాలు అంటూ తిరుగుతున్నారు. మరోవైపు ఈ కుంభకోణాల గురించి తెలిసి కూడా సీఎం జగన్.. ఆ నేతలను ఎందుకు మందలించడం లేదు. ఎందుకు ఆ నేతలకు చివాట్లు పెట్టడం లేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ టైమ్ లో ఇలాంటి భూ కుంభకోణాలు ఏంటంటూ జగన్ క్లాస్ పీకాలి. ఇవన్నీ పార్టీకి నష్టం కలిగిస్తాయని చెప్పాలి. కానీ.. అటువంటిదేమీ జరగడం లేదని తెలుస్తోంది. అందుకే.. ఆయా నేతలు రెచ్చిపోయి మరీ ఇలా భూకుంభకోణాలకు పాల్పడుతున్నారు.