Mahesh Babu : తల్లి చనిపోయిన 15 రోజుల తరవాత ఆమె ఆఖరి కోరిక తీర్చిన మహేశ్ బాబు

Advertisement

Mahesh Babu : తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం మర్చిపోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. ప్రముఖ హీరో మహేష్ బాబు అమ్మగారు ఇందిరాదేవి మరణించడం ఘట్టమనేని అభిమానులను విషాదంలో ముంచేసింది. ఇప్పటికే అమ్మ పోయిన బాధలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మహేష్. ఈ మధ్య ఆమె అస్తికలను గంగా నదిలో నిమజ్జనం చేశారు. మరో రెండు వారాల తర్వాత గానీ ఆయన షూటింగ్ కు వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు మహేష్. నిజానికి అక్టోబర్ 14 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా షెడ్యూల్ మరో రెండు వారాలు ఆలస్యంగా మొదలు కానుంది.

Advertisement

కృష్ణ సతీమణి ఇందిరా దేవి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పుట్టింది. ఈయనకు చిన్న వయసులోనే సూపర్ స్టార్ కృష్ణతో పెళ్లయింది. ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న 9 సంవత్సరాల తర్వాత నటి, దర్శకురాలు విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూపర్ స్టార్. అయినా కూడా ఇద్దరు భార్యలకు సమాన ప్రాధాన్యత ఇచ్చాడు ఈయన. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్, రమేష్ బాబు, మంజుల సహా మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. కృష్ణతో పెళ్లయ్యి పిల్లలు పుట్టాక తరచూ తన కొడుకులతో కలిసి తన సొంత ఊరు ముసలిమడుగు వెళ్లి వచ్చేవాళ్ళు ఇందిరా. ఆమె ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా అందర్నీ చాలా ఆప్యాయంగా పలకరించేదని.. అంత పెద్ద ఇంటి కోడలు అయినా కూడా అందరినీ ఎంతో బాగా ఆదరించేవారు మంచి మనసున్న మనిషి అంటూ సొంతూరులో ఆమెకు చాలా మంచి పేరు ఉంది.

Advertisement
mahesh babu be a good son
mahesh babu be a good son

Mahesh Babu : సొంతూరులో ఆప్యాయంగా..

అహం అనే మాటే ఇందిరా దేవిలో కనిపించేది కాదు అంటారు సొంతూరు వాళ్ళు ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న తర్వాత సొంతూరి ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. 70 సంవత్సరాల వయసులో ఆమె తనువు చాలించారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు అమ్మ చేతి కాఫీ అంటే ఎంత సెంటిమెంట్ తన ప్రతి సినిమా విడుదల రోజు అమ్మ ఇంటికి వెళ్లి ఆమె చేతి కాఫీ తాగితే ఒక ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుందని ఎన్నోసార్లు చెప్పాడు మహేష్ బాబు. ఆయన కూతురు సితారకు నాన్నమ్మతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

ఇదిలా ఉంటే తాను బతికుండగానే తన మనవరాలు సితార ఓణీల ఫంక్షన్ చూడాలి అనేది ఇందిరాదేవి కోరిక అని.. అది మహేష్ బాబుకు చెప్పినా కూడా అలాంటివి తనకు నచ్చవు అని ఆయన పట్టించుకోలేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అమ్మ చనిపోయిన తర్వాత ఆమె చివరి కోరిక తీర్చలేకపోయాననే బాధ మహేష్ లో కనిపిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమ్మ పేరు మీద తన కూతురు సితార ఓణీల ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలని ఆయన భావిస్తున్నాడు. మరోవైపు సితార కూడా నానమ్మ మరణాన్ని అంత ఈజీగా మర్చిపోవడం లేదు. ఆమె పార్థివ దేహం ముందు కూర్చుని కన్నీరు మున్నీరుగా వినిపించింది సితార.

Advertisement