Hero Nani : నానిని చూడగానే పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. అద్భుతమైన నటనతో నేచురల్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతలు అందుకున్న నాని కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు.నాని ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో విభిన్నమైన కథ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తన యాక్టింగ్ టైమింగ్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈసారి పూర్తిస్థాయిలో విభిన్నంగా పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దసరా అనే సినిమాతో ఈ సారి ఎలా అయిన పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాని.
నాని నటించిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో ఏమీ లాభాలు అందించలేదు. ఇక తర్వాత వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా సినిమా అయితే ఫెయిల్ అయింది. ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్లేషకులు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. సినిమా దుమ్ముదులిపేస్తుందని భావించగా, టాక్ కి తగ్గట్టు కలెక్షన్స్ లేవు. పూర్ ఓపెనింగ్స్ తో పాటు నిరాశాపూరితమైన రన్ కొనసాగింది.

Hero Nani : ఇంత దారుణమా?
భారీగా నష్టాలు మిగిల్చిన అంటే సుందరానికీ నాని కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. బుల్లితెరపై అయిన అదరగొడుతుందని అనుకుంటే, అక్కడ కూడా నిరాశనే మిగిల్చింది. అంటే సుందరానికీ చిత్ర శాటిలైట్ రైట్స్ జెమినీ దక్కించుకుంది. ఇటీవల మూవీ ప్రసారం చేయగా డిజాస్టర్ లో డిజాస్టర్ టీఆర్పీ రాబట్టింది. అంటే సుందరానికీ అర్బన్, రూరల్ కలిపి యావరేజ్ గా 1.8 టీఆర్పీ వచ్చిందట. ఇది అసలు ఊహకు కూడా అందని రెస్పాన్స్. నాని చిత్రాల్లో అత్యధికంగా టక్ జగదీశ్ 10.89 టీఆర్పీ రాబట్టింది.
టక్ జగదీశ్ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బుల్లితెరపై గౌరవప్రదమైన టీఆర్పీ నమోదు చేసింది. అయితే ఒక సినిమా నాలుగో సారో, ఐదో సారో ప్రదర్శించినా కూడా ఇంత కంటే మెరుగైన టీఆర్పీ వస్తుంది. 2 పాయింట్స్ కూడా దాటకపోవడం నిజంగా ఆశ్చర్యం. దీనికి ఓటీటీనే కారణమని కొందరు అంచనా వేస్తున్నారు.