Nayanthara : న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్‌కి పెద్ద రిలీఫ్‌.. క‌వ‌ల‌లు పుట్టింది వారికేన‌ట‌..!

Advertisement

Nayanthara : గ‌త కొద్ది రోజులుగా విఘ్నేష్ శివ‌న్ న‌య‌న‌తార ప‌లు వివాదాల‌తో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్.. విఘ్నేష్.. జూన్ 9న వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా అక్టోబర్ 9న తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ట్వీట్ చేసి వివాదంలో నిలిచింది ఈ జంట. నయన్ దంపతులకు పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. దీంతో వీరి సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది.. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం.. పిల్లల జననంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే తమకు ఆరేళ్ల క్రితమే చట్టబద్ధంగా వివాహం జరిగిందంటూ నయన్ దంపతులు ప్రభుత్వానికి తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో వివాదానికి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టే తెలుస్తుంది.

Advertisement

సరోగసి ప్రాసెస్ కి వెళ్ళిన మాట నిజమే కానీ అది ఇండియాలో కాదు దుబాయ్ లో అని చెప్ప‌డంతో త‌మిళనాడు ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందట . ఇక అన్ని వివాదాలు స‌మ‌సిపోవ‌డంతో ఈ జంట దీపావ‌ళిని సంతోషంగా జ‌రుపుకున్నారు. ఎవ్రీ టూ ఆఫ్ యూ అని అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన విఘ్నేశ్ శివన్ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. ఇందులో నయన్, విఘ్నేశ్ ఇద్దరూ కూడా తమ పిల్లలను చేతుల్లో ఎత్తుకుని ఉన్నారు. ఇక నయన్ ముసి ముసి నవ్వులు నవ్వేస్తోంది. వీడియో చివర్లో నయన్ నుదుటిని విఘ్నశ్ ఓ ముద్దు కూడా పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement
nayanthara and vignesh shivan with their twin babies
nayanthara and vignesh shivan with their twin babies

Nayanthara : ఫుల్ ఖుష్‌..

ఇన్నాళ్లు సోలోగా ఉన్న వారిని ఇలా పిల్లలతో కలిసి చూసిన ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .ఏది ఏమైనా సరే ఇకనుంచి అయినా ఈ జంట అన్ని సవ్యంగా జరిగేలా చూసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉండాలి.. కష్టాలు తొలిగి అందరికీ సుఖసంతోషాలు ప్రాప్తించాలి.. అందరూ అందరికీ కోసం ప్రార్థించండి.. ప్రేమను పంచండి.. మన అందరికీ పంచగలిగేది ప్రేమను మాత్రమే.. ఈ జీవితాన్ని ఎంతో అందంగా మార్చేది కూడా ఈ ప్రేమే.. దేవుడి పట్ల, ప్రేమ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలోని మంచి పట్ల మనం నమ్మకంగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది అంటూ విఘ్నేశ్ శివన్ త‌న కామెంట్ ద్వారా తెలిపాడు.

Advertisement