Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా కాంట్రవర్సీస్‌తో ఈ అమ్మడు హట్ టాపిక్ అవుతుంది. ఇటీవల పబ్‌లో నిహారిక రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో నిహారికపై తెగ ట్రోల్ జరిగింది. నాగబాబు దీని గురించి క్లారిటీ ఇచ్చిన ట్రోలింగ్ ఆగలేదు. ఆ క్రమంలో సోషల్ మీడియాకి కూడా కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే నిహారిక కాస్త సందడి చేయడం మొదలు పెట్టింది.నిహారికకు వెకేషన్లలో ఉండటం అంటే మహా ఇష్టం. గోవా, పాండిచ్చెరి, మాల్దీవులు అంటూ ఇలా తిరుగుతూనే ఉంటుంది. అయితే నిహారిక ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురించింది. ఇంత వరకు ఇలా ఎప్పుడూ కూడా కనిపించలేదు నిహారిక. పొట్టిబట్టల్లో నిహారిక ఆ మధ్య కొన్ని సార్లు కనిపించింది.
రీసెంట్ గా తన స్నేహితులతో కలిసి ఆమె టర్కీల్లోని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ అమ్మడు ఒక బీచ్ ఒడ్డున హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక తన స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఫోటోలకు కూడా పోస్ట్ చేసింది.ఒక ఫోటోలో నిహారిక టాప్ బికినీలో కనిపించింది. ఆమె పక్కనే మరొక ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఎప్పుడు బికినీలో కనిపించని నిహారిక ఇప్పుడు ఆ విధంగా టాప్ బికినీలో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకోవడంతో ఒక్కసారిగా అది ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారిపోయింది.

Niharika : దారుణం..
ఏ మెగా డాటర్ ఇలాంటి చెత్త పని చేయలేదని నువ్వు మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావని నిహారికపై మండిపడుతున్నారు . నువ్వు బికినీ వేసుకోవాలంటే వేసుకుని ఆనందించాలి గాని.. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్టేనా, ఏమండి నాగబాబుగారు దీనిపై మీ స్పందన ఏంటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నటిగా బిజీ అవుతుంది అనుకున్న తరుణంలోనే నిహారిక పెళ్లి చేసుకుంది. ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయినా చైతన్య జొన్నలగడ్డ ను పెళ్లి చేసుకున్న ఆమె పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. అలాగే చిన్న బడ్జెట్లో కూడా సినిమాలను నిర్మించడానికి భర్తను ఒక బిజినెస్ పార్ట్నర్ గా కూడా చేసుకుంది.