NTR Health University : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పేరు మార్పు గురించే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లోనూ దీని గురించే చర్చ. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. అసలు ఎన్టీఆర్ పేరును ఎందుకు మార్చాలి. ఈ సమయంలో ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ అని పెట్టడం వల్ల ఒరిగేదేముంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన బిల్లును కూడా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించుకుంది. దీని వల్ల.. వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసి కూడా సీఎం జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా.. జగన్ మాత్రం తాను అనుకున్నది చేస్తారని అందరికీ తెలుసు కదా. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఇదే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో వాళ్లకు కూడా తెలియడం లేదట. అయితే.. పేరు మార్పు వల్ల.. ఇద్దరు వైసీపీ నేతలకు మాత్రం చాలా ఇబ్బంది ఎదురవుతోంది. వాళ్లే వల్లభనేని వంశీ, కొడాలి నాని. ఈ ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే. ఇద్దరూ టీడీపీలో ఉన్నవాళ్లే గతంలో.

NTR Health University : ఎన్టీఆర్ పేరు మార్చొద్దని వంశీ.. జగన్ ను కోరారా?
నిజానికి వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. కానీ.. తర్వాత వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ పేరు మార్చొద్దని జగన్ ప్రభుత్వాన్ని కోరాడట. తన నిర్ణయంపై పునరాలోచించాలంటూ జగన్ ను కోరినా కూడా జగన్.. వంశీ మాటను పట్టించుకోలేదు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఓకే కానీ.. హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడం వద్దు అంటూ వేడుకున్నా కూడా ఫలితం దక్కలేదు. మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం ఎందుకో ఈ విషయంలో సైలెంట్ అయిపోయాడు. అసలు ఈ విషయం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తనకు ఈ విషయంలో ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో?