Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. కాని కొందరు అతనిని లేని పోని వివాదాలలోకి తీసుకెళ్లి రచ్చ చేస్తుంటారు. అయిన్పపటికీ జూనియర్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండగా, రాజకీయాలలోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అది త్వరలోనే జరగుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తల్లి గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాంతారా సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. షాలినిది కర్నాటకలోని విద్వాంసుల కుటుంబం. ఆమెకు శాస్త్రీయ సంగీతం బాగా వచ్చు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కుటుంబంలో ఉన్న మనవరాళ్లు, మనవళ్లకు సంగీతం నేర్పించాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు షాలిని ప్రతి రోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి సంగీతం నేర్పించేది. అయితే శిక్షణ పూర్తయ్యాక హరికృష్ణే స్వయంగా ఆమెను కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటివద్ద దిగబెట్టేవారు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. షాలిని ఏ నాడు కూడా హద్దుఉల దాటలేదు. ఎంతో అణుకువతో ఉంటుంది. ఎప్పుడో కాని బయట కనపడరు. ఆమె తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్తోనే కలిసి ఉంటోంది.

Jr NTR : ఇది అసలు విషయం..
కాంతారా సినిమా దర్శకుడు రిషిబ్ శెట్టి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని తాజాగా బయట పెట్టారు. ఆమె కర్నాకటలోని బృందాపూర్కు చెందిన వారట. తెలుగులో తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పిన రిషిబ్.. వారి తల్లి షాలిని గారు తమ ప్రాంతమైన బృందాపూర్కు చెందిన వారు అన్నాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మాసెస్ట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశ లోకి అయితే చేరుకోలేదు కానీ సినిమా పై మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇంకా చాలా విషయాలు అయితే ఈ చిత్రానికి ఇంకా సెట్ల్ కావాల్సి ఉండగా పలు రూమర్స్ మాత్రం అలా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.