OnePlus 10R 5G Prime : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి 10 ఆర్ మోడల్ 5జీ ప్రైమ్ బ్లూ ఎడిషన్ ఫోన్ తాజాగా భారత్ లో లాంచ్ అయింది. ఇదివరకే రిలీజ్ అయిన వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ఫోన్ కు ఇది కొనసాగింపుగా వచ్చింది. గత ఏప్రిల్ లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. వన్ ప్లస్ 10ఆర్ ప్రైమ్ బ్లూ ఎడిషన్ ఫోన్ మీడియా టెక్ డైమెన్షిటీ 8100 మాక్స్ ఎస్వోసీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెచ్ జెడ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్ తో ఇది పనిచేయనుంది.
భారత్ లో ఈ ఫోన్ ను రూ.38,999 ధరకు ఫిక్స్ చేశారు. కానీ.. అమెజాన్ లో రూ.32,999 కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం అదనపు డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. ఏప్రిల్ లో రిలీజ్ అయిన స్టాండర్డ్ ఎడిషన్ కు ఇది కొనసాగింపు అయినప్పటికీ ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. 6.7 ఇంచ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,

OnePlus 10R 5G Prime : 50 ఎంపీ రేర్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ షూటర్ తో రానున్న 10ఆర్ 5జీ ఫోన్
మీడియాటెక్ డైమెన్షిటీ 8100 మాక్స్ ఎస్వోసీ, 3డీ పాసివ్ కూలింగ్ టెక్నాలజీ, హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజన్, జనరల్ పర్ ఫార్మెన్స్ అడాప్టర్(జీపీఏ), ఫ్రేమ్ స్టెబిలైజర్, 50 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ షూటర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు రెండు కలర్స్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. డుయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సెలేషన్ సపోర్ట్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.