Oppo : ఒకప్పుడు ఫోన్స్‌తో పాటు ఛార్జర్, హెడ్ సెట్ కూడా ఇచ్చే వారు. కాని ఇటీవలి కాలంలో ఫోన్‌తో పాటు కేవలం ఛార్జర్ మాత్రమే వస్తుంది.హెడ్ సెట్ ఆపేశారు. అది కావాలి అనుకునే వారు బయట కొనుక్కోవల్సి వస్తుంది. అయితే ఇప్పటి వరకు యాపిల్, శాంసంగ్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ మొబైల్స్‌తో పాటు మిడ్ రేంజ్ ఫోన్లకు కూడా ఛార్జర్లు ఇవ్వడం మానేశాయి. ఈ క్రమంలోనే ఒప్పో కూడా తమ కొన్ని సెలెక్టెడ్ ఫోన్ మోడళ్ల బాక్స్‌లలో ఛార్జర్లను ఇవ్వమని ప్రకటించింది. ఈ మోడల్స్ ఏంటనేది కంపెనీ వెల్లడించలేదు కానీ 2023 నుంచి కొన్ని ఫోన్లు ఛార్జర్లు లేకుండా డెలివరీ అవుతాయని స్పష్టం చేసింది.
ఇది వినియోగదారులని కాస్త నిరాశపరచిన పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి, ముడి పదార్థాలను ఆదా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నిజానికి ఒప్పో వంటి చైనీస్ బ్రాండ్లు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జర్లను అందిస్తుంటాయి. ఇలాంటివి బయట దొరకడం యూజర్లకు కష్టమే. ఈ ఫోన్లు యూఎస్బీ పవర్ డెలివరీ వంటి ఛార్జింగ్ స్టాండర్డ్‌తో కూడా రావడం లేదు. అందువల్ల కొత్త ఛార్జర్ కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారే అవకాశముంది. ఇంట్లో 15W, 30W, 40W వంటి ఛార్జర్లు వీటికి సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ ఫోన్లలో ఛార్జర్ అందించకపోతే ఎక్కువమంది యూజర్లకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు.

Oppo : పర్యావరణం కోసమా?
శాంసంగ్, యాపిల్ వంటి కంపెనీలు 45W లేదా 20W రేంజ్‌లోనే ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకొస్తుంటాయి. దీనివల్ల ఒకే ఛార్జర్ పలు జనరేషన్ల ఫోన్లకు వాడటం సాధ్యమవుతుంది. ఒప్పో రెనో 8 సిరీస్‌ను యూరప్‌లో లాంచ్ చేస్తున్న సందర్భంగా ఛార్జర్ల గురించి ఒప్పో ఓవర్సీస్ సేల్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సూపర్‌వూక్ ఛార్జర్లు యూజర్లకు బయట దొరకడం అసాధ్యం కాబట్టి వాటిని బాక్స్‌లో అందించాల్సి ఉంటుంది. కానీ మేం బిజినెస్ యాక్టివిటీస్ పెంచుతున్నాం. వాటిలో భాగంగా ఛార్జర్లను బాక్స్ నుంచి తొలగించి స్టోర్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచుతాం అని బిల్లీ జాంగ్ పేర్కొన్నారు.