Pachimirchi Pachadi Recipe : పచ్చిమిర్చితో పచ్చడి చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం ఇడ్లీ చపాతీలలోకి ఎంతో బాగుంటుంది. ఇందులో కొన్ని మసాలాలు వేయడం వలన పచ్చిమిర్చి పచ్చడి ఎంతో సూపర్ గా వస్తుంది. పచ్చిమిర్చి పచ్చడి కారం లేకుండా ఈ స్టైల్ లో చేసుకుని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) పచ్చి మిర్చి 2) ఆయిల్ 3) పచ్చి శనగపప్పు 4) మినప గుళ్ళు 5) మెంతులు 6) జీలకర్ర 7): ఆవాలు 8) పసుపు 9) వెల్లుల్లి 10) చింతపండు 11) కరివేపాకు 12) ఎండుమిర్చి
తయారీ విధానం: ముందుగా 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి తొడిమలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, రెండు స్పూన్ల శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప గుండ్లు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత ఇదే కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్, చిటికెడు పసుపు వేసి పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసి కొద్దిసేపు కలుపుకొని దానిపై మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిసేపు కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పప్పులు వేసి మెత్తగా పొడి లాగా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టుకున్న చింతపండును వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ముందుగా పట్టుకున్న మసాలాకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పోపు వేసుకోవాలి. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసి రెండు మూడు వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును పచ్చిమిర్చి పేస్ట్ లోకి వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి పచ్చడి రెడీ.