Phone : ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఫోన్ ద్వారా అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఫోన్‌ని కాల్స్ కోసమే కాక ఇతర పనులకి కూడా ఉపయోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ జ్ఞాపకాలను ఇందులో నిక్షిప్తం చేసుకుంటున్నారు. అయితే సంవత్సరాల కొద్ది ఫొటోలు తీసుకుంటూనే వెళుతుంటాం కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. చాలా సార్లు ఫోన్లో స్టోరేజీ నిండిపోతే మనం అనుకోకుండా అవసరమైన ఫోటోలు ఇంకా వీడియోలను డిలెట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో చాలా మంది తెగ ఫీలయిపోతుంటారు. మరి అలాంటి ఫోటోలను మళ్లీ పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.. అవి ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ స్టార్ట్ ఫోన్స్‌లో గూగల్ ఫోటోస్ యాప్ ఉంటుంది.
ఈ యాప్ తో ఫొటోస్ అన్ని కూడా గూగుల్ బ్యాకప్‌లో సేవ్ అవుతాయి. ఫోన్ నుండి డిలెట్ అయిన ఫోటోలను గూగుల్ ద్వరాఆ ఒకే క్లిక్‌లో తిరిగి పొందవచ్చు. అయితే, దీని కోసం మీరు ముందుగా గూగుల్ ఫోటోస్ లో బ్యాకప్‌ని ఆన్ చేయాల్సి ఉంటుంది. డిలెట్ చేసిన ఫోన్-వీడియోలను తిరిగి పొందడానికి గూగుల్ ఫోటోస్ యాప్‌ని తెరిచి మెను నుండి ట్రాష్ లేదా బిన్‌కి వెళ్లండి. ఇక్కడ మీరు డిలెట్ చేసిన అన్ని ఫోన్-వీడియోలను తిరిగి తెచ్చుకోవచ్చు. లేదంటే మీ అండ్రాయిడ్ ఫోన్ నుండి లేదా ఫోన్లో ఉన్న మెమరీ కార్డ్ నుండి ఫోటోలను డిలెట్ చేస్తే మీరు వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు.

Phone : తిరిగి తెచ్చుకోవచ్చు..
కార్డ్ రీడర్ సహాయంతో మీరు మెమరీ కార్డ్‌ని ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి తర్వాత రికవరీ సాఫ్ట్ వేర్‌తో కూడా పొందొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లోని ఏదైనా మంచి థర్డ్ పార్టీ యాప్ సహాయంతో ఫోటోలు-వీడియోలని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మీరు డేటా రికవరీ కోసం DiskDigger అండ్ Dr.Fone యాప్ సహాయం కూడా తీసుకొని ఫొటోలు, వీడియోలని తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు రికవరీకి వెళ్లి ఇక్కడ నుండి ఫోటోలు, వీడియోలను సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ ఫోన్ స్క్రీన్‌పై ఓపెన్ అయిన ఫుల్ డేటా లిస్ట్ లో రికవర్ చేయాలనుకుంటున్న ఫోటోలను సెలెక్ట్ చేసి రికవర్ పై నొక్కండి, అప్పుడు అన్ని ఫోటోలు తిరిగి వస్తాయి.