Pooja Hegde : తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరును సంపాదించుకుంది పూజ హెగ్డే. దాదాపుగా స్టార్ హీరోలు అందరితో తను నటించింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో పూజా హెగ్డే ఒకరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆస్థానంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది పూజ హెగ్డే. ఈ మధ్యన అలవైకుంఠపురం, రాదే శ్యామ్ ,వంటి మూవీలలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.
ఇక తన తొడల అందాలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది పూజ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది పూజ హెగ్డే.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది పూజ హెగ్డే. అయితే ఇటీవల తను బాలీవుడ్ లో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే మూవీని సల్మాన్ ఖాన్ తో కలిసి చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ లో యాక్షన్ సీన్లు చేస్తుండగా పుజా గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాలు విరిగిందా లేదా ఫ్యాక్చర్ అయ్యిందా అనేది క్లారిటీగా తేలియడం లేదు. ప్రస్తుతానికి పూజ హెగ్డే బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఫోటోలను షేర్ చేసింది.

ఇక ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ప్రస్తుతం పూజ హెగ్డే చాలా బిజీగా ఉంది.ఇటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తూ అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో కూడా నటిస్తుంది పూజా. అలాగే రన్వీర్ సింగ్ హీరో గా చేస్తున్న సర్కస్ సినిమా లోను పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పుడు పూజా హెగ్డే కు గాయం కావడంతో షూటింగ్ లన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన పూజ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.