Post Office Scheme : కొన్ని ప్రభుత్వ పథకాలలో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ,మొత్తంలో లాభాలను గడించవచ్చు. ప్రతినెల లేదా ఆరు నెలలకు ఒకసారి వార్షిక రూపంలో డబ్బును డిపాజిట్ చేసి మంచి వడ్డీ రేటును పొందవచ్చు. ఇలాంటి ప్రభుత్వ పథకం లో ఒకటి పోస్ట్ ఆఫీస్ కు చెందిన విలేజ్ సెక్యూరిటీస్ స్కీమ్. ఇందులో పెట్టుబడి దారులు కొద్దిగా డబ్బును ఇన్వెస్ట్ చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలను పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారులు నెలకు రూ.1500 డిపాజిట్ చేసి మెచ్యూరిటీ సమయంలో రూ.31 నుండి రూ.35 లక్షల వరకు పొందవచ్చు.
అయితే ఈ పధకం లో 19 నుండి 50 సంవత్సరాల వయసు గల భారతీయులు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ పథకం కింద కనీస బీమా మొత్తం పదివేల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష స్కీమ్, ప్రీమియంను నెలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు .ప్రీమియం చెల్లించడానికి కస్టమర్స్ కు 30 రోజులు గడువు ఇవ్వబడుతుంది.

అయితే ఒక పెట్టుబడిదారుడు 19 సంవత్సరాల వయసులో ఈ పథకం లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకుందాం. పెట్టుబడిదారుడు 55 ఏళ్ల వయసులో 31.60 లక్షలు పొందడానికి నెలకు రూ.1515 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.1463 చెల్లిస్తే 58 ఏళ్ల వయసులో 33.40 లక్షలు పొందవచ్చు. అలాగే నెలకు రూ.1411 చెల్లిస్తే 65 ఏళ్ల వయసులో 34.60 లక్షలు మొత్తాన్ని పొందవచ్చు. అంటే ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు 50 రూపాయలు చెల్లించడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు 35 లక్షల రాబడి పొందుతారు.ఇక ఈ పథకంపై ప్రభుత్వం ఇటీవల 6.6 శాతం ఉన్న వడ్డీని 6.7 ఖాతానికి పెంచింది. దీని కారణంగా పెట్టుబడిదారులు ఇప్పుడు దీనిపై మరింత లాభాలను పొందవచ్చు.