Prabhas Fans : ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. అవును.. అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది తెలుగు ఇండస్ట్రీలో. చాలామంది హీరోలు.. ఇప్పుడు ఫామ్ లో లేకపోవచ్చు కానీ.. ఒకప్పుడు వాళ్లు నటించిన సినిమాలు తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియానే షేక్ చేశాయి. అందుకే.. ఎవరైనా హీరో, హీరోయిన్ బర్త్ డేలు వస్తే చాలు.. వాళ్ల పుట్టిన రోజున సెలబ్రేషన్స్ చేయడంలో భాగంగా వాళ్ల కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలనో లేక వాళ్ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలనో ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఆ సినిమాలను ఓవర్సీస్ లోనూ ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇటీవల మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన పోకిరి సినిమాను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ చేశారు ఆయన ఫ్యాన్స్. అలాగే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రీరిలీజ్ చేశారు. తమ్ముడు సినిమాను కూడా కొన్ని చోట్ల ప్రదర్శించారు. అలా.. పలువురు హీరోలు నటించిన సినిమాలను ఈమధ్య రీరిలీజ్ చేసే ట్రెండ్ ప్రస్తుతం స్టార్ట్ అయింది.

Prabhas Fans : ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రెబెల్, బిల్లా సినిమాలను ప్రదర్శిస్తున్న ప్రభాస్ అభిమానులు
అయితే.. త్వరలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ లోనే ఫ్లాప్ అయిన రెబెల్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అక్టోబర్ 15న రెబెల్ సినిమాను గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే.. బిల్లా సినిమాను కూడా స్పెషల్ షో వేస్తున్నారట. అందుకే.. మిగితా హీరోల ఫ్యాన్స్ కంటే.. రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. మిగితా హీరోల అభిమానులు వాళ్ల సూపర్ హిట్ అయిన, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తుంటే.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ఫ్లాప్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం వర్షం సినిమాను స్పెషల్ షో వేస్తున్నారట. ఏది ఏమైనా.. రెబెల్ ఫ్యాన్స్ అంటేనే వేరు అప్పా.. వాళ్ల థింకింగే వేరు. సేమ్ ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉంటారో.. ఆయన ఫ్యాన్స్ కూడా అంతే.