Baahubali 3 : బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు.. యావత్ భారత దేశ చరిత్రనే ఈ సినిమా తిరగరాసింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఒక్కసారిగా తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం అయింది. యావత్ భారతదేశం అంతా బాహుబలి సినిమాను చూసి నివ్వెరపోయారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి.
అయితే.. త్వరలో బాహుబలి 3 కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే సినిమాలా కాకుండా ఒక వెబ్ సిరీస్ లా బాహుబలి 3ని తీసే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో యూఎస్ లో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబతి 3 పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను బాహుబలి 3పై ఎప్పుడో హింట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు.

Baahubali 3 : బాహుబలి 2 సినిమా ఎండ్ కార్డ్స్ లోనే హింట్ ఇచ్చామని చెప్పిన రాజమౌళి
బాహుబలి 2 సినిమా ఎండింగ్ కార్డ్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో మళ్లీ మహేంద్ర బాహుబలి కొడుకు మాహిస్మతికి రాజు అవుతాడా అనే డైలాగ్ ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. మేము హింట్ ఇచ్చినా కూడా ప్రేక్షకులు పసిగట్టలేకపోయారని, రాజమౌళి చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలోనే బాహుబలి 3కి బీజం పడిందని చెప్పారు. దీంతో బాహుబలి 3 గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరి.. ఇది ఒక వెబ్ సిరీస్ గా వస్తుందా? లేక పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కుతుందా? ఈ సినిమాలో ఎవరు మహేంద్ర బాహుబలి కొడుకుగా నటిస్తారు.. అనేది మాత్రం తెలియదు. చూద్దాం మరి.. ఈ సినిమాపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో వేచి చూడాల్సిందే.