Rashmika: షార్ట్ టైంలో స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. ప్రస్తుతం కెరీర్ సాఫీగానే సాగుతున్నా కూడా పర్సనల్ విషయాలకు సంబంధించిన వార్తలు అభిమాననులని కలవరపరుస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక, కన్నడ హీరో రక్షిత్ శెట్టి కలిసి మొట్ట మొదట కిరిక్ పార్టీ సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న టైంలో రష్మిక రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పేసింది. అయితే ఆ సమయంలో రష్మిక తెలుగులో ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం కూడా పెద్ద హిట్ కొట్టింది. అనంతరం వరుస ఆఫర్స్ రావడం మొదలైంది. కరోనా కూడా అప్పుడే ఎంట్రీ ఇవ్వడం, రష్మిక మైండ్ సెట్ మారడం జరిగింది. అయితే కెరీర్ కొసం రక్షిత్‌కి గుడ్ బై చెప్పిందని అంటున్నా, విజయ్ దేవరకొండతో లవ్ ఎఫైర్ వల్లే రక్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పింది అన్న రూమర్లు కూడా ఉన్నాయి. ఇటీవల విజయ్ రష్మిక తెగ కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఇద్దరూ మాల్దీవులకు వెళ్లారు. గీత గోవిందం తర్వాత మరోసారి వీరు డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించారు.

Rashmika : ఎవరిది తప్పు..
అయితే ఇప్పుడు రక్షిత్, రష్మిక ఎవరి దారులు వారు చూసుకోగా, రష్మికనే.. రక్షిత్ శెట్టిని మొదటి సినిమాకు వాడుకుని స్టార్ స్టేటస్ రాగానే వదిలేసిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే హిందీలో గుడ్ బై చిత్రంతో ప్రేక్షకులను అలరించింది నేషనల్ క్రష్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మిశ్రమ స్పందన లభించింది. ఇదే కాకుండా.. ప్రస్తుతం హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు త్వరలోనే పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోననుంది. అలాగే తమిళంలో విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు సినిమాలో నటిస్తుంది. అయితే ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న రష్మికకు మరిన్ని ఆఫర్స్ తలుపుతడుతున్నాయి.