Rakul Preet Singh: అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళ్ లో కొన్ని చిత్రాలు చేస్తున్నారు. మొత్తంగా అరడజను చిత్రాలకు పైగా ఆమె ఖాతాలో ఉన్నాయి. నెలల వ్యవధిలో రకుల్ ప్రీత్ నటించిన అటాక్, రన్ వే, కట్ పుట్లి చిత్రాలు విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.అయితే ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రకుల్ తన లవ్ గురించి ఓపెన్ కాగా, అప్పటి నుండి ఈ అమ్మడి పెళ్లి గురించి ఏదో ఒక చర్చ నడుస్తుంది.
2021 అక్టోబర్ నెలలో రకుల్ తన ప్రియుడ్ని పరిచయం చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రకుల్ సోషల్ మీడియా పోస్ట్ ఒకింత షాక్ ఇచ్చింది. ఎలాంటి హింట్ లేకుండా ఆమె తన లవ్ స్టోరీ బయటపెట్టడం సంచలనం రేపింది. అయితే తన లవ్ గురించి చెప్పడం వరకు బాగానే ఉంది కాని పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం ఈ అమ్మడు పలు మార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తాజాగా జాకీ భగ్నానీ – రకుల్ ప్రీత్ సింగ్.. వచ్చే ఏడాది సమ్మర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆమె సోదరుడు అమన్ వెల్లడించారనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh : కిక్ బాగుంది..
ఈ క్రమంలో రకుల్ స్పందించింది. అమన్, నువ్వు నా పెళ్లి గురించి ఏమైనా చెప్పవా!. నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో. నా జీవితం గురించి నాకే తెలియకపోవటం కామెడీగా ఉంది’ అంటూ తన పెళ్లి వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయ్యింది. ఇదే సందర్భంలో తెలుగు సినిమాల్లో ఎందుకు నటించటం లేదనే దానిపై కూడా ఆమె స్పందించింది. ‘ఈ మధ్య కాలంలో నేను తెలుగు సినిమాల్లో నటించటం లేదనే సంగతి నాకు కూడా తెలుసు. కానీ త్వరలోనే తప్పకుండా తెలుగులో నటిస్తాను. తెలుగు అభిమాలను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు సినీ పరిశ్రమే కారణం’ అని తెలియజేసింది రకుల్.