Rakul Preet Singh : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన రకుల్ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆఖరి సారిగా ఈమె 2021 లో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన “కొండపొలం” అనే సినిమాలో నటించింది. గత కొంతకాలంగా ఈమె కేవలం బాలీవుడ్ సినిమాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్న రకుల్ ప్రీత్ తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఊహించిన వివాదంలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది .
కొందరు ఆమెపై వల్గర్ కామెంట్స్ చేశారు . రకుల్ ఫిజిక్ మగరాయుడులా ఉంటుందని ..ఆమెను చూస్తే మూడ్ రాదు అని చెత్త కామెంట్స్ చేశారు . ఇక అలాంటి టైం లోనే రకుల్ ప్రీత్ సింగ్ చేతికి వచ్చిన ఆఫర్లు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే ప్రభాస్ నటింఇచన డార్లింగ్ సినిమాలో ముందుగా రకుల్‌ని కథానాయికగా అనుకున్నారట. స్క్రీన్ టెస్ట్ కూడా చేసి అగ్రిమెంట్లు పేపర్లపై మరో రెండు రోజుల్లో సైన్ చేయబోతుంది అనగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు డైరెక్టర్ ఆమెకు చెప్పారట. దీనికి కారణం ప్రభాసే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్ కి రకుల్ లుక్స్ అంత నచ్చలేదని , రకుల్ కొంచెం హార్డ్ యాంగిల్ లోనే బాగుంటుందని ప్రబాస్ ఆమెని వద్దన్నాడట.

Rakul Preet Singh : అదే కారణమట..
అలా ప్రభాస్ సినిమా ఆఫర్ మిస్ చేసుకుంది రకుల్. ఇక ఇటీవల తెలుగు సినిమాలు చేయకపోవడంపై స్పందించింది. “చాలామంది ఇప్పటికే ఈ ప్రశ్న అడిగారు. కానీ నేను మాత్రం తెలుగు సినిమా చేయలేకపోతున్నాను. నాకు నా తెలుగు అభిమానులు అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను ఇలా ఉండటానికి గల కారణం కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి వచ్చే సంవత్సరం నేను తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందని అనుకుంటున్నాను,” అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్. ఇక ప్రస్తుతం హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ “డాక్టర్ జి” అనే సినిమాలో నటించింది.