Rambha : రంభ.. ఈ అమ్మడి పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది ఈ సీనియర్ బ్యూటీ. విజయవాడకు చెందిన ఈ హీరోయిన్ అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె పేరును రంభగా మార్చేశారు. . సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో 2010లో మలేషియాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్ర కుమార్‌ను రంభ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియలో సందడి చేస్తుంది.
దాదాపు దశాబ్ధం పాటు తెలుగు తెరపై అప్సరసలా.. ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రంభ. తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. ఇక చిన్నగా అవకాశాలు తగ్గిపోడంతో .. సినిమాలకు దూరమయ్యింది రంభ.కొన్నేళ్లపాటు భోజ్‌పురి సినీ ఇండస్ట్రీని రంభ ఒక ఊపు ఊపేసింది. భోజ్‌పురి భాషలో రంభకు చాలా క్రేజ్ వచ్చేసింది. భోజ్‌పురి భాషలో ఆమె టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడే అక్కడ స్టార్ హీరోగా ఉన్న మనోజ్ తివారితో ఆమె ప్రేమలో పడిందనే అంటారు. వీరిద్దరు తెగ చక్కర్లు కొట్టారు. అంతేకాదు ఒకానొక దశలో వీరు పెళ్లి చేసుకుంటారు అనే వరకు వచ్చింది. అయితే అప్పటికే మనోజ్ తివారికి పెళ్లయిపోయింది. ఆ తర్వాత రంభ భోజ్‌పురిలో సినిమాలు తగ్గిస్తూ వచ్చింది.

Rambha : ఏం జరిగింది..
చాలా ఏళ్లగా అన్యోయ్యంగా ఉంటూ వస్తోన్న ఈ దంపతులకు మధ్య కొన్ని మనస్పర్థలు కూడా వచ్చాయట..తన భర్తకు విడాకులిస్తానంటూ.. రంభ కూడా పంతానికి పోయిందట. దాంతో వీరిద్దరు పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. విడిపోతున్నారు అంటూ ప్రచారం నడిచింది. రంభతో బోంబాయి ప్రియుడు లాంటి హిట్ సినిమాలు చేసిన.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ఆమెతో మాట్లాడి మళ్ళీ భార్యాభర్తలను కలిపారట. భర్తకు దూరమైతే సమాజంలో ఎలాంటిఇబ్బందుల వస్తాయి. అని చెప్పడంతో పిల్లల పోషణకు ఎలాంటిసమస్యలు వస్తాయో చెప్పడంతో .. ఆమె మెత్తపడిందట. అంతే కాదు చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని రాఘవేంద్రరావు చేసిన సూచనలతో రంభ తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుందట.