Ramoji Rao : తెలుగుదేశం పార్టీ ఓడిపోతోంది.. పవన్ కల్యాణ్ గెలుస్తోంది రామోజీరావు వల్లనే?

Advertisement

Ramoji Rao : మీకు గుర్తుందా? 2004 ఎన్నికల్లో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004 నుంచి 2008 వరకు అంతా సజావుగా జరిగింది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి అనగా.. ఈనాడు రామెజీ రావు స్టార్ట్ చేశారు. అప్పట్లో వైఎస్సార్ ప్రారంభించిన పలు పథకాల్లో అవినీతి ఉందని.. వైఎస్సార్ ప్రభుత్వంపై రాతలు స్టార్ట్ చేశారు. పెద్దలా గద్దలా అంటూ ఓ పేరు పెట్టి ఆ పేరుతో ఇక తన పత్రికలో వరుసగా కథలను వండి వార్చారు. ఎన్నికల వరకు అదే పని. సంవత్సరం పాటు వరుసగా వైఎస్సార్ ప్రభుత్వం అవినీతిపై పుంఖానుపుంఖలుగా కథనాలు వచ్చాయి. అయినా సరే.. 2009 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తిరిగి వైఎస్సార్ నే గెలిపించారు. కట్ చేస్తే ఇప్పుడు వైఎస్సార్ కొడుకు వైఎస్ జగన్ ఏపీని పాలిస్తున్నారు.

Advertisement

ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకో 18 నెలల సమయం ఉంది. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉండగానే మరోసారి ఈనాడు రామోజీరావు స్టార్ట్ చేశారు. సేమ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. అప్పుడు వైఎస్సార్ కు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారో.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. రాజధానిపై జగన్నాటకం పేరుతో రామోజీ రావు వరుస కథనాలను తన పత్రికలో ప్రచురిస్తున్నారు. అంటే.. సేమ్ జగన్ పై దాడి మొదలైందని అర్థం అవుతోంది. అయితే.. అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ.. మూడు రాజధానుల పేరుతో భూదందాలకు తెర లేపారు. వైజాగ్ ను పరిపాలన రాజధానిని చేస్తా అని ప్రకటించడంతో అక్కడ ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి.

Advertisement
Ramoji Rao same strategy on ys jagan which followed on ysr regime
Ramoji Rao same strategy on ys jagan which followed on ysr regime

Ramoji Rao : వైజాగ్ లో భూదందాలు నిజమేనా?

కేవలం భూదందాల కోసమే సీఎం జగన్ వైజాగ్ ను రాజధానిగా ప్రకటించారని అంటున్నారు. ఏకంగా సొంత పార్టీ నేతలే వైసీపీ భూదందాపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ కూడా ఎదురు దాడి చేస్తోంది. అందుకే ఎల్లో మీడియాతో జగన్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ సైతం సిద్ధమైంది. అయితే.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా. ఇప్పటి నుంచే ఎందుకు టీడీపీ అప్పుడే తొందరపడి ఎదురు దాడికి దిగింది. ఎన్నికలకు ముందు అయితే జనాల్లో కాస్త ప్రభావం ఉంటుంది కానీ.. ఇప్పటి నుంచే ఇవన్నీ మొదలుపెడితే అప్పటి వరకు అన్నీ మరిచిపోతారు అని అంటున్నారు. అందుకే.. పవన్ కళ్యాణ్ కూడా తన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ముందే తన బస్సు యాత్రను నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ.. టీడీపీ మాత్రం తొందరపడి ఇప్పుడే తన అస్త్రాలను ప్రయోగిస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

Advertisement