Rashmi : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ పెంచుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. తనదైన అందం, అభినయం, యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడు టీవీ షోలే కాదు.. సినిమాల్లోనూ రష్మీ తెగ సందడి చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో సందడి చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. ఇందులో రష్మీ చిరు నవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతుంది. ముఖ్యంగా ఈ డ్రెస్ లో రష్మీ లుక్స్ అదిరిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం రష్మీ క్యూట్ లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
రష్మీ ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే అడపదడపా సినిమా ఆఫర్స్ పట్టేస్తున్నారు. నటిగా యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. లక్షల సంపాదన, కోరుకున్న కెరీర్ సక్సెస్ అందివచ్చినప్పటికీ రష్మీని ఓ వేదన వెంటాడుతూ ఉంటుంది. అది మూగజీవాల సంరక్షణ. రష్మీ యానిమల్ లవర్. వాటికి ఏ రూపంలో హాని జరిగినా ఆమె తట్టుకోలేరు. జీవ హింసను పూర్తిగా వ్యతిరేకించే రష్మీ ఫక్తు శాకాహారి. కేవలం చెట్ల నుండి వచ్చే పండ్లు, కూరగాయలతో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు వచ్చాయి.

Rashmi : క్యూట్ లుక్స్..
దీంతో ఈ బ్యూటీ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ మాత్రం వస్తూనే ఉంది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోతో పాటు జబర్దస్త్ షోకీ యాంకర్ గా వ్యవహారిస్తోంది.అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ. ఆమెకు వెండితెర అంతగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది.ఇక యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మి గౌతమ్.