Realme New Phone : త‌క్కువ ధ‌ర‌కే రియ‌ల్ మీ సీ 33.. ధ‌ర‌, స్పెసిఫికేష‌న్స్ ఏంటంటే..!

Advertisement

Realme New Phone : రియ‌ల్ మీ ఫోన్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో అత్యాధునిక ఫోన్స్ లాంచ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌క్కువ ధ‌ర‌కి మంచి స్పెసిఫికేష‌న్స్‌తో రియ‌ల్ మీ ఫోన్స్ మార్కెట్‌లోకి వ‌స్తున్న నేప‌థ్యంలో వినియోగ‌దారులు వీటిని కొనేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. అయితే మంగ‌ళ‌వారం రియ‌ల్ మీ నుండి మ‌రో ఫోన్ విడుద‌లైంది. రియల్‌మీ సీ33 తాజాగా లాంచ్ కాగా, ఇందులో 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, UniSoc ప్రాసెసర్‌తో వస్తోంది. తక్కువ ధ‌ర‌కే ఈ ఫోన్‌ని లాంచ్ చేయ‌డంతో అంద‌రు దీనిని కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ ఫోన్ ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం అవుతాయి.

Advertisement

ఈ ఫోన్ లో 6.5 అంగుళాల డిస్ ప్లే, యూనిసాక్ టీ612 ప్రాసెసర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా వున్నాయి. 3జీబీ, 32జీబీ, 4జీబీ, 64జీబీ వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా వున్నాయి. ఇంటర్నల్ స్టోరేజీని ఒక టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. 10వాట్ల స్టాండర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ పవర్ బటన్‍కే ఉంటుంది. 6.5 ఇంచుల హెచ్‌డీ+ LCD డిస్‌ప్లేతో ఈ ఈ బడ్జెట్ 4జీ ఫోన్‌ వస్తోంది. గరిష్ఠంగా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను రియల్‌మీ ఈ ఫోన్‌లో ఇస్తోంది.

Advertisement
Realme C33 at a low price
Realme C33 at a low price

Realme New Phone : మ‌రో ఫోన్ లాంచ్..

ఫొటోలు క్లారిటీగా క్లిక్ అయ్యేలా ఎన్‌హాచ్‌మెంట్ కోసం సీహెచ్ డీఆర్ అల్గారిథమ్‌ను ఈ ఫోన్‌లో ఇస్తున్నట్టు రియ‌ల్ మీ పేర్కొంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది రియల్‌మీ సీ33 బడ్జెట్ ఫోన్‌ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.8,999, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ టాప్‌ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మీ వెబ్‌సైట్ లో ఈ మొబైల్‌ సేల్‌కు రానుంది. అక్వాబ్లూ, నైట్ సీ, సాండీ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.

Advertisement