Realme C33 : ఈ నెలలో చాలా కంపెనీలు వెరైటీ ఫోన్స్‌ని మార్కెట్ లోకి లాంచే చేసే ఆలోచనలో ఉంది. సెప్టెంబర్ 6న రెడ్ మీ, రియల్ మీతో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. రియల్ మీ ఫోన్స్ తక్కువ ధరకు మంచి కాన్ఫిగరేషన్‌తో మార్కెట్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రియల్ మీ సంస్థ 9ఐ 5జీ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ 9ఐ 4జీ ఫోన్ ఇంతకు ముందే మార్కెట్లో అందుబాటులో ఉంది. 5జీ టెలికం సేవలు త్వరలోనే ప్రారంభం కానుండడంతో, 5జీ వెర్షన్ ను రియల్ మీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 8.1 ఎంఎంతో స్లిమ్ గా ఉంటుంది.
Realme C33 : రియల్ మీ సేల్..
ఇక సెప్టెంబర్ 6న రియల్ మీ సీ33 ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. రియల్ మీ నుండి రాబోయే స్మార్ట్ ఫోన్ 50 – మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా మరియు 5,000mAh బ్యాటరీతో ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి హ్యాండ్సెట్ యొక్క ఇతర వివరాలు పొందుపరచలేదు. అయితే, ఫోన్ కోసం అధికారిక రియల్ మీ ఇండియా వెబ్సైట్లో కొన్ని వివరాలు అందించారు. ఇది డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ మరియు స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. గత నెలలో, రియల్ మీ సీ 33 ఫోన్ మూడు రంగులలో రానుందని వార్తలు వచ్చాయి. మరి అదే జరుగుతుందా, లేక ఏదైన మార్పులు జరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక రియల్ మీ సీ33 సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు శనివారం ప్రకటించారు.

రియల్ మీ సీ 33 ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఇది గరిష్టంగా 37 రోజుల స్టాండ్‌బై ఉంటుందని తెలుస్తుంది. పొడిగించిన బ్యాటరీ లైఫ్ కోసం ఫోన్ అల్ట్రా సేవింగ్ మోడ్‌ను కూడా పొందుపరచడం జరిగింది. ఫోన్ 8.3 మిమీ స్లిమ్‌గా ఉంటుందని మరియు 187 గ్రా బరువు ఉంటుందని రియల్ మీ ధృవీకరించింది. ఇది 3GB RAM + 32GB స్టోరేజ్, 4GB RAM + 64GB స్టోరేజ్ మరియు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందించబడుతుందని వాటి ధరలు రూ. 9,500 మరియు రూ. 10,500గా ఉంటాయని సమాచారం. ఇక రియల్ మీ 9ఐ 5జీఫోన్.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.16,999. ఆగస్ట్ 24న అమ్మకాలు మొదలవుతాయి. ఆరంభంలో కొనుగోలు చేసేవారికి ఈ ధరపై రూ.1,000 తగ్గింపు ఇస్తోంది.