Realme GT Neo 3T: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం రియల్మీ సంస్థ మార్కెట్లోకి సరికొత్త ఫోన్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమలో శుక్రవారం భారత్‌లో రియల్మీ జీటీ నియో 3టీని విడుదల చేసింది. కొత్త ఫీచర్లు, కొన్ని నూతన అప్గ్రేడ్లతో ఈ ఫోన్లో మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసిన దీనిపై అందరు ఆసక్తి చూపుతున్నారు. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో రియల్మీ నయా మిడ్ రేంజర్ వస్తోంది. 12 నిమిషాల్లోనే 50శాతం చార్జ్ అవుతుందని రియల్మీ సంస్థ పేర్కొంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు E4 AMOLED డిస్ప్లేతో రూపొందింది.
స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఈ మొబైల్లో ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఉపయోగించుకొని అదనంగా 5జీబీ వరకు ర్యామ్‌ను పొడిగించుకునే ఫీచర్‌ను రియల్మీ ఇస్తోంది.దీని వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‌కు ఇచ్చింది రియల్మీ. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 2 మైక్రోఫోన్లు, డాల్బీ, అట్మోస్ స్పీకర్స్, ఇక ఆప్టికల్ ఫింగర్‌ఫ్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. రియల్మీ జీటీ నియో 3టీలో 3 వేరియెంట్లలో లభిస్తోంది.

Realme GT Neo 3T : మంచి ఫీచర్స్‌తో..
6/128జీబీ వేరియేషన్ ధర రూ.29,999గా ఉంది. 8జీబీ/128జీ వేరియెంట్ రూ.31,999, 8జీబీ/256జీబీ ధర రూ.33,999గా ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. డాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ మూడు రంగుల్లో ఫోన్ లభించనుంది. సెప్టెంబర్ 23 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉండనుందని కంపెనీ వెల్లడించింది. ఫస్ట్ సేల్‌లో రియల్మీ జీటీ నియో 3జీపై రూ.7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చని రియల్మీ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు ఈ ఫోన్‌కి లభిస్తాయి. ఈ ఆఫర్స్‌తో ఉపయోగించుకొని రూ.22,999కే దక్కించుకొవచ్చని రియల్ మీ పేర్కొంది.