Redmi 11 Prime 5g : భారత్‌లో 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అందరు 5 జీ ఫోన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు 5జీ ఫోన్స్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెడ్మీ 11 ప్రైమ్ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉంది. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ మొబైల్ మీడియాటెక్ డైమన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్ రిష్రెష్ రేట్ ఈ డిస్ప్లే సొంతం.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ చిప్‌ను ఇచ్చారు. అలాగే 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 6.58 ఇంచుల పుల్ హెచ్డీ+ LCD డిస్ప్లేను Redmi 11 Prime 5G, Prime 4G స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను రెడ్మీ పొందుపరిచింది.

Redmi 11 Prime 5g : మంచి ఫోన్..
ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13 ఓఎస్‌పై రన్ అవుతాయి. రెడ్ మీ 11 ప్రైమ్ 5G, మొబైళ్లలో 5000mAh బ్యాటరీ ఉంటుంది. రెండు మొబైల్స్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి. అయితే బాక్స్‌లో 22.5 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను రెడ్మీ ఇస్తోంది. ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్, షావోమీ వెబ్సైట్ , ఎంఐ హోమ్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లోనూ సేల్ మొదలవుతుంది. మెడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రెడీ మీ 11 ప్రైమ్ 5జీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ మొబైల్‌ను కొంటే రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.