Sai Pallavi : సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. తనకు తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా. తను ఒక డ్యాన్సర్. ఆ తర్వాత తన అందంతో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది సాయి పల్లవి. తను చాలా యాక్టివ్. హీరోయిన్లలో డ్యాన్స్ చేయాలంటే తన తర్వాతనే ఎవరైనా. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.హీరోలకు దీటుగా డ్యాన్స్ వేయడం తనకు కొట్టిన పిండి.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తను నటించింది. తన డ్యాన్స్ కు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తను ఒక లేడీ హీరో. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలన్నా ఖచ్చితంగా దర్శకనిర్మాతలు సాయిపల్లవి వైపే చూస్తారు. కానీ.. ఈ మధ్య తను నటించిన పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన జోరు కొంచెం తగ్గింది.పలు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పేరు హరిహర వీరమల్లు.

Sai Pallavi : చివరకు పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న సాయి పల్లవి
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. మరో హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. ఇదే నిజం అయితే సాయి పల్లవి కెరీర్ గాడిలో పడినట్టే. క్రిష్.. సాయి పల్లవిని మరో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అందులోనూ సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ మధ్య స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ మధ్య స్పెషల్ సాంగ్ అంటే ఇక డ్యాన్స్ కు కొదవ ఉండదు. చూద్దాం మరి.. నిజంగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవిని తీసుకున్నారా? లేదా? అని.