Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు తన క్రేజ్‌తో బాలీవుడ్, హాలీవుడ్‌లోను సందడి చేసేందుకు సిద్ధమైంది. సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్హీరోయిన్గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పెంపుడు శునకం ఫోటోను షేర్ చేస్తూ.. ” వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన ఇప్పుడు వైరలవుతుంది. సామ్ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
పెళ్లి విషయంలో సమంత చాలా హర్ట్ అయింది. ఈ అమ్మడు సోలోగా జీవితం గడుపుతుంది. అయితే రెండో పెళ్లి విషయంలో సమంతకి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వారితో వీరితో అంటూ ప్రచారాలు జరుగుతున్నా కూడా దీనిపై క్లారిటీ రావడం లేదు. అయితే సమంత సినిమా వాడిని తప్ప మిగతా ఎవరినైన చేసుకునేందుకు సిద్ధంగ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. సమంత పెళ్లి విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లారు. వచ్చారు. అలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లేరు.

Samantha : ఇది నిజమా?
సమంత స్కిన్ ప్రోబ్లమ్ తో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అందుకే ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లారని, అంతకు ముందు పూజలు, హోమాలు చేయించారని రకరకాల వార్తలు వచ్చాయి. సమంత చేస్తున్న రెండు సినిమాలు యశోద, శాకుంతలం అలా వుండిపోయాయి. త్రీడీ వెర్షన్ అనే మాట చెప్పి, శాకుంతలం సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసేసారు. యశోద సినిమా డేట్ ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వర్క్ పెండింగ్ లో పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ లో వున్నారని తెలుస్తోంది. మరి అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో లేదా, ఇటీవల వరుసగా వస్తున్న సమస్యల కారణంగా హోమాలు చేయించుకుంటున్నారో అర్ధం కావడం లేదు.