SBI : కరోనా నేపథ్యంలో గృహ రుణాలపై వడ్డీరెట్లు భారీగా తగ్గాయి. మళ్లీ కొంతకాలం తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.అయితే ఇప్పుడు ఇంటి లోన్ తీసుకునేవారికిి మంచి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. తన వినియోగదారుల కోసం ప్రభుత్వ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఈ భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇక ఈ డిస్కౌంట్ ఈనెల 4 వ తేదీ న అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఆఫర్ 2023 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎస్బిఐ హోమ్ లోన్ యొక్క వడ్డీ రేటు 8.5 శాతం నుండి 9.0 శాతం ఉండగా , ఫెస్టివల్ క్యాంపెయిన్ ఆఫర్లు లో భాగంగా ఎస్బిఐ వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 కు తగ్గించింది.
దీంతో వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 9.05 శాతం వరకు వర్తించనుంది. అయితే కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా 8.40 శాతం నుంచి 9.05% మధ్య వడ్డీ రేటు ఉంటుంది. అంటే సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే అంత తక్కువ వడ్డీకే గృహ రుణం అందించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిబిల్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే 8.40 వడ్డీతో రుణం ఇస్తామని ఇది 8.5 సాధారణ వడ్డీతో పోలిస్తే 0.15% తక్కువ అని ఎస్బిఐ తెలిపింది.

మరోవైపు సిబిల్ స్కోర్ 750 నుంచి 799 ఉంటే వడ్డీ రేటు 8.65% నుంచి 8.40 శాతానికి చేరనుంది. అదే సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే 0.20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ఎస్బిఐ పేర్కొంది. సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువ ఉంటే మాత్రం ఎస్బిఐ చెబుతున్న ఏ విధమైన డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు. అయితే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది శుభవార్త. ఆలస్యం చేస్తే మాత్రం ఈ డిస్కౌంట్ ఆఫర్ పోయే అవకాశం ఉంటుంది. మళ్లీ సాధారణ వడ్డీ రేటుకే హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా హోమ్ లోన్స్ కోసం ప్రయత్నించేవారు ఈ ఆఫర్లను గమనించి తీసుకోండి.