Nayanatara: లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లైన నాలుగు నెలలకే తల్లి అయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.. అయితే ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని సుప్రీం కోర్టు 2019లో తీర్పును ఇచ్చింది. . దీంతో ఇప్పుడు నయన్ అద్దె గర్భం ద్వారా పిల్లల్నీ కనడం సోషల్ మీడియాలోనే కాకుండా.. అటు తమిళనాడుతో పాటు తెలుగులో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. చట్టానికి వ్యతిరేకంగా ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను ఈ జంట కన్నట్టయితే వీరికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ అంశంపై తాజాగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సరైనా సమయంలో అన్ని తెలుస్తాయంటూ ట్వీట్ చేశారు.
ఇక అసలు నయనతార ఎవరి అద్దె గర్భంతో పిల్లలని కనింది అనే చర్చ కూడా జరుగుతుంది. నయనతార పెళ్లిలో హడావిడి చేసిన తన చిన్ననాటి స్నేహితురాలు ఈ ప్రాసెస్ మొత్తానికి మూల కారణం అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పిల్లలని కనడం ఇష్టం లేదని నయనతార చెప్పగా, ఆ సమయంలో ఆమె ఫ్రెండ్ సరోగసి ప్రాసెస్ ను ఎక్స్ ప్లైన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడి ఎట్టకేలకు తల్లిదండ్రులు అవ్వడానికి కారణం అయిందట. ఆ అమ్మాయి వల్లనే నయనతార విఘ్నేష్ శివన్ పలు బాధలు పడాల్సి వస్తుదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Nayanatara : ఆమె కారణమా?
అసలు సరోగసి అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు గానీ ఇప్పుడు సరోగసి అంటే చాలామందికి తెలిసిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వల్ల సరోగసి అనే పదం ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. దానికి కారణం చాలామంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు.. టాలీవుడ్ లో మంచు లక్ష్మి ఈ సరోగసి విధానం ద్వారానే తన కూతురుకు జన్మనిచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు.