Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా ఉండదు. మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతుంది శ్రీముఖి. అందాల రాములమ్మ ట్రెడిషన్ లుక్ ఫోటోల్లో మరింత స్వీట్‌గా ఉండటం విశేషం.శ్రీముఖి ఈ మద్య మత్తెక్కించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీముఖిని ఇలా చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి ఇప్పుడు తెలుగు టీవీ రంగంలో యాంకర్‌గా దూసుకుపోతుంది. ఆమె స్పెషల్ షోలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్పెషల్ ఈవెంట్లతోనూ కనువిందు చేస్తుంది.
ప్రస్తుతం శ్రీముఖి `జాతిరత్నాలు`, `సరిగమప`, `డాన్సు ఐకాన్` వంటి షోలకు రెగ్యూలర్ యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అలాగే ఓ జానపద పాటలకు సంబంధించిన షోకి యాంకర్‌గా చేస్తుంది. ఎనర్జీతెచ్చే షోలకు రాములమ్మ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆహాలో వచ్చే `డాన్సు ఐకాన్`కి జడ్జ్ గానూ చేస్తుండటం విశేషం. యాంకర్ ఇలా జడ్జ్ గా చేయడం అరుదైన విషయం. ఈ విషయంలో అనసూయ, రష్మిలను మించిపోతుందని చెప్పొచ్చు. ఈ అమ్మడు సినిమాలలోను ఫుల్ బిజీగా మారుతుంది. ఆ మధ్య `మ్యాస్ట్రో`లో మెరిసింది. ఇప్పుడు చిరంజీవితో `భోళా శంకర్` చిత్రం చేస్తుంది. వెండితెరపై కూడా తన ప్రతిభని చాటుకుంటూ ఆకట్టుకుంటుంది.

అన్నివర్గాల ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతుంది.శ్రీముఖి కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె యాంకర్ గా జోరు చూపిస్తున్నారు. పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆహాలో ఇటీవల మొదలైన డాన్స్ ఐకాన్ యాంకర్ గా చేస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి స్కిన్ షో హద్దులు దాటేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీముఖి క్యూట్ లుక్స్ మత్రం ప్రతి ఒక్కరి మతులు పోగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.