Sreeleela : ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణి అవడం అంటే మామూలు విషయం కాదు. అందంగా ఉంటే సరిపోదు. అందంతో పాటు నటన రావాలి. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే హీరోయిన్ అవుతారు. ఇండస్ట్రీలో రాణిస్తారు. ఎంత అందం ఉన్నప్పటికీ.. అవకాశాలు వచ్చినా కూడా కొందరు వెంటనే ఫేడ్ అవుట్ అవుతారు. కొందరు అమ్మాయిలు సంవత్సరాల పాటు ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతారు కానీ… హీరోయిన్ ఛాన్సులు మాత్రం రావు. వచ్చినా వాళ్లకు సరైన హిట్ పడదు. దీంతో అక్కడితో వాళ్ల కెరీర్ కు పుల్ స్టాప్ పడుతుంది.
కానీ.. రష్మిక మందన్నా లాంటి వాళ్లకు మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఒకేసారి అదృష్టం వరిస్తుంది. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్లు అవుతారు. అలాంటి హీరోయిన్లలో రష్మిక తర్వాత స్థానంలో శ్రీలీల ఉంది. అవును.. తను లక్కీ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. 2021 లో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీలీల.కేవలం ఒకే ఒక్క సినిమాతో శ్రీలీల ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. తాజాగా ఏకంగా పాన్ ఇండియా మూవీలోనే హీరోయిన్ చాన్స్ ను కొట్టేసింది శ్రీలీల.

Sreeleela : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన శ్రీలీల
బోయపాటి శ్రీను, రామ్ పొతినేని కాంబోలో ఒక పాన్ ఇండియా మూవీ వస్తోంది. ఆ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నట్టు తెలుస్తోంది. బోయపాటి అఖండ మూవీ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. తన తదుపరి మూవీ రామ్ తో చేస్తున్నాడు. అది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. రామ్ కు సరసన శ్రీలీల అయితే బాగుంటుందని బోయపాటి భావించాడట. అందుకే.. తనను తీసుకోవాలని అనుకున్నాడట. తాజాగా తన సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్టు బోయపాటి అధికారికంగా ప్రకటన చేశారు. అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో రవితేజ సినిమాలో నటిస్తోంది. నవీన్ పొలిశెట్టితో మరో మూవీ, ఇంకో తెలుగు మూవీలోనూ నటిస్తోంది.