Junior NTR : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రౌడ్ పుల్లింగ్ చేయగల ఏకైక నటుడు ఎన్టీఆర్. ఈ మధ్యన రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 తో మాస్ క్రేజ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక తన చిన్న వయసులోనే బాల రామాయణంలో శ్రీరామ చంద్రుడు పాత్ర లో నటించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కథలను ఎంచుకునే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.కథలను ఎంపిక చేయడంలో పర్ఫెక్ట్ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుంచి మరింత జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ వరుసగా బ్లాక్ బాస్టర్ కొడుతున్నాడు.
ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తారక్ తో పాటు చరణ్ కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ చేసిన బీమ్ పాత్ర అందరికీ బాగా నచ్చింది. అలాగే చరణ్ మరియు ఎన్టీఆర్ కార్డినేషన్ ఈ సినిమాలో ఎంతో బాగుంది. ఓవరాల్ గా సినిమా అదిరిపోయింది. దీంతో ఈ సినిమా ను ఇటీవల జపాన్ లో విడుదల చేయాలని సినీ బృందం నిర్ణయించుకుంది. దానికోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ ,రాజమౌళి ,సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు. ఇక ఎన్టీఆర్ గురించి మనకు తెలిసిందే. ఎక్కడకు వెళ్లిన ఆ ప్రదేశానికి సంబంధించిన భాషలో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాడు.

అయితే ఇటీవల జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ జపాన్ లాంగ్వేజ్ ను మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. జపనీస్ భాషలో ఎన్టీఆర్ ఏం మాట్లాడడంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటంటే..హలో ఎవరీ వన్, అందరూ ఎలా ఉన్నారు, ,మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది, ఈ సినిమాని ఎంజాయ్ చేయండి ,థాంక్యూ థాంక్యూ అని ,జపానీస్ లో మాట్లాడాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అలవోకగా జపనీస్ భాషను మాట్లాడడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.