Munugodu Bypoll : మునుగోడులో ఇంకా ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు కానీ.. అప్పుడే మునుగోడులో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. ఇప్పటికే బీజేపీ క్యాండిడేట్ ను ప్రకటించినట్టే. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఆయన బీజేపీలో చేరడంతో పాటు మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ నుంచి అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే మునుగోడులో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.
ఇక.. కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది. పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మిగిలింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. మునుగోడులో అభ్యర్థి ఖరారు కాకున్నా.. నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను తీసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ.. మునుగోడులో గెలుస్తామా? లేదా అని ఇంకా సీఎం కేసీఆర్ అక్కడ సర్వేలు చేయిస్తున్నారట.

Munugodu Bypoll : మునుగోడులో ప్రచార బాధ్యతలను తీసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి
ఫైనల్ సర్వే ముగిస్తే కానీ.. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి ఎవరో తేలేలా లేదు. ఇప్పటికే జనం – వనం పేరుతో టీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రచారాన్ని ప్రారంభించింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా మునుగోడులో క్యాంపేశారు. అసలు అభ్యర్థి ఎవరో కన్ఫమ్ కాకముందే టీఆర్ఎస్ నేతలు మాత్రం టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు. నిజానికి మునుగోడులో బీసీలకు ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ తనకు టికెట్ కావాలని ఆయన కోరుతున్నారట. అసలు టికెట్ ఎవరికి ఇవ్వాలి… మునుగోడులో గెలవాలంటే టికెట్ ఎవరికి ఇస్తే బెటర్ అనే అంచనాలు వేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అభ్యర్థి విషయంలో ఇంకా ఎటూ తేల్చడం లేదు.