Business Idea : ఈ రోజుల్లో జాబ్ ఎవరు చేస్తారు.. 9 టు 5 జాబ్ బోర్ అంటూ చాలామంది యువత తన మెదడుకు పదును పెట్టి మరీ సొంత బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. రిస్క్ ఎక్కువ అని తెలిసినా కూడా రిస్క్ చేస్తేనే లైఫ్ ఉంటుందని అని నమ్మి.. కొత్త కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేస్తూ పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా ఏదో ఉద్యోగం చేయకుండా మంచి ఆలోచనతో కొత్త కొత్త ఐడియాలతో, బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్లలో గుంటూరుకు చెందిన చిరంజీవి, నరసింహారావు కూడా ఒకరు. వీళ్లు సివిల్ ఇంజనీరింగ్ చదివినా కూడా చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఆ తర్వాత సొంత బిజినెస్ కోసం ప్రయత్నించారు.
అప్పుడే వీళ్లకు ఓ ఐడియా వచ్చింది. అదే బయో డీగ్రేడబుల్ ప్లేట్స్. ప్రస్తుతం మార్కెట్ లో పేపర్ ప్లేట్స్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. మామూలు పేట్స్ కంటే కూడా బయో డీగ్రేడబుల్, ఈకో ఫ్రెండ్లీ పేట్స్ కు మరింత డిమాండ్ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసిన అన్నదమ్ములు వెంటనే లక్షన్నర పెట్టుబడి పెట్టి విజయ కనకదుర్గ పేపర్ ప్లేట్స్ కంపెనీని స్థాపించారు. మార్కెట్ లో ప్రస్తుతం దొరికే పేపర్ ప్లేట్స్ కంటే కూడా చాలా క్వాలిటీని మెయిన్ టెన్ చేస్తూ ప్లేట్స్ ను తయారు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. ఇంట్లో వాళ్లంతా ఇదే పని చూస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు.

Business Idea : ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు
మంచి ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ ఇద్దరు అన్నదమ్ములు నిరూపించారు. అన్ని రకాల ప్లేట్స్, బఫే ప్లేట్స్ ఇలా వివిధ రకాల ప్లేట్స్ ను తయారు చేస్తున్నారు. ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే లాభాలు గడించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. లేబర్ ఖర్చు లేకుండా ఇంట్లోని వాళ్లే అందరూ కలిసి పని చేసుకొని డబ్బులు మిగుల్చుకుంటున్నారు. మొత్తానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొంది గుంటూరులోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు అన్నదమ్ములు.