Unstoppable Season 2 : బాలకృష్ణలో మరో కొత్త కోణం చూపించిన షో అన్‌స్టాపబుల్. ఇన్నాళ్లు బాలకృష్ణని నటుడిగా మాత్రమే మనం ఊహించుకున్నాం. కాని అన్‌స్టాపబుల్ షో తర్వాత ఆయన హోస్ట్‌గాను ఎంతగా అదరగొడతారనే విషయం అందరికి అర్ధమైంది. ఆహాలో గతేడాది ప్రసారమైన అన్‌స్టాపుబల్ షో అత్యధిక టీఆర్పీతో రికార్డులు క్రియేట్ చేయడమే కాక ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది.సెలబ్రిటీలతో బాలయ్య ఓపెన్‌గా, బోల్డ్ గా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడిన తీరుకి ప్రతి ఒక్కరు బ్రహ్మారథం పట్టారు. ఈ షోతో ముందుగా మోహన్ బాబు హాజరు కాగా, ఆ తర్వాత అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బోయపాటి శ్రీను, రవితేజ, రాజమౌళి వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. చివరగా మహేష్ పాల్గొన్నారు.
తొలి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అన్స్టాపబుల్విత్ఎన్బీకే2` త్వరలోనే ప్రారంభం కాబోతుందని `ఆహా` నిర్వహాకులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ పోస్టర్ని విడుదల చేస్తూ ఈ విషయాన్ని తెలియజేడంతో బాలయ్య అభిమానులకి అవధులు లేకుండా పోయాయి. `త్వరలో ఫెస్టివల్ ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా` అంటూ పంచుకున్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సీజన్‌కి కూడా బాలయ్యనే హోస్ట్ గా ఉండనున్నారు.

Unstoppable Season 2 : గుడ్ న్యూస్..
దసరాకి ఈ షోని ప్రారంభిస్తారని అందరు ఊహిస్తున్నారు. మరి ఈ సీజన్ 2 లో ఎవరెవరు గెస్టులుగా రానున్నారో తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్ షోతో బాలయ్యలో మంచి ఫన్ యాంగిల్ కూడా ఉందని,ఆయన మనస్తత్వం చిన్నపిలాడిలా ఉంటుందని అందరికి ఓ క్లీరిటీ వచ్చింది. బాలయ్య చేసిన సందడి అయితే ప్రతి ఒక్కరికి భలే నచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ .. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ చిత్రం సంక్రాంతికి రాబోతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం.