BRS : ఆ రెండు కుటుంబాలూ BRS లోకి.. ఇక కే‌సీఆర్ కి తిరుగులేదు?

Advertisement

BRS : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ గా మార్చడం అందరికీ తెలుసు కదా. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు కేసీఆర్. దాని కోసం పక్కా ప్రణాళిక వేస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. తర్వాత కేసీఆర్ టార్గెట్ ఏపీ. ఎందుకంటే ఏపీ కూడా మరో తెలుగు రాష్ట్రం. అక్కడ కూడా బీఆర్ఎస్ ను విస్తరించాలని అనుకుంటున్నాడు కేసీఆర్. అక్కడ ఏపీలో అధికారంలో ఉన్నది ఎవరో కాదు.. తన మిత్రుడు జగనే. ప్రస్తుతం వాళ్లు శత్రువులుగా ఉన్నప్పటికీ.. త్వరలో మిత్రులు అయ్యే అవకాశాలు లేకపోలేవు.

Advertisement

అయితే.. మిగితా రాష్ట్రాలు వేరు. ఏపీ వేరు. ఏపీలో బీఆర్ఎస్ పాగా వేయడానికి కేసీఆర్ వద్ద పక్కా వ్యూహం ఉంది. వచ్చే ఎన్నికల లోపు అంటే 2024 లోపు ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం అయ్యే చాన్సెస్ ఉన్నాయి. అయితే వైసీపీ లేదంటే టీడీపీ.. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఓడితే ఆ పార్టీ ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏపీలో రెండు కుటుంబాలు మాత్రం బీఆర్ఎస్ వెంట వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ ఆ రెండు కుటుంబాలు బీఆర్ఎస్ లోకి వస్తే ఏపీలో బీఆర్ఎస్ కు తిరుగులేదు ఇక.

Advertisement
what is the strategy of kcr to strengthen brs in ap
what is the strategy of kcr to strengthen brs in ap

BRS : సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ ప్లాన్

వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఏపీలో సీఎం కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు.  విజయవాడ, గుంటూరులో సంక్రాంతి తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బహిరంగ సభల తర్వాత కొందరు నాయకులను పార్టీలోకి చేర్చుకోనున్నారు. ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉండనుంది. అయితే.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వస్తోంది కాబట్టి.. ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంట వామపక్ష పార్టీలు నడిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బీసీ నినాదాన్ని కేసీఆర్ పట్టుకోనున్నారు. ఎందుకంటే.. ఏపీలో చాలా ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది రెడ్డీలే. వాళ్లే ముఖ్యమంత్రులు అవుతూ వస్తున్నారు. అందుకే.. బీసీ నినాదాన్ని వినిపిస్తే.. బీఆర్ఎస్ లో చేరేందుకు పలువురు ముఖ్య నేతలు ఆసక్తి చూపించవచ్చు. అందులో ధర్మాన ప్రసాదరావు కుటుంబం ఉండనుంది. ఆ తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం ఉంది.

Advertisement