KCR : కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఆ ఒక్క పార్టీనే మద్దతు ఇస్తుందట.. మరి మిగితా పార్టీల సంగతి?

Advertisement

KCR : త్వరలోనే రైతులను ఏకం చేస్తా.. రైతు పార్టీ పెడతా.. రైతులే ఈ దేశాన్ని ఏలేలా చేస్తా అని సీఎం కేసీఆర్ స్టేట్ మెంట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి.. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే అసలు ఆయనకు ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా? కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు మద్దతు ప్రకటిస్తాయా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలే.. సౌత్ ఇండియాకు చెందిన నేత కేసీఆర్. అది కూడా ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ. మరి.. ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అది కూడా దక్షిణాది నుంచి వచ్చిన నేత.. ఢిల్లీ వెళ్లి పార్టీ పెడితే ఎవరు సమర్థిస్తారు. నార్త్ ఇండియాలోని పార్టీలు ఆ జాతీయ పార్టీకి మద్దతు ఇస్తాయా? ఆ పార్టీ వెంట నడుస్తాయా? అనే దానికి సమాధానం చెప్పడం మాత్రం కష్టమే.

Advertisement

ఎందుకు అంటే.. అది ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ అయినా ఏ పార్టీకి దాని సొంత అజెండాలు ఉంటాయి. ఏ రాష్ట్ర పార్టీ అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి ముందు ఆలోచిస్తుంది కానీ.. దేశ ప్రయోజనాల గురించి కాదు. ఎందుకంటే.. ముందు తమ రాష్ట్రం బాగుపడితే. ఆ తర్వాత దేశం బాగుపడుతుంది అని ఆలోచించే పరిస్థితి వాళ్లది. మనం మంచిగుంటే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగుంటే మన ఊరు బాగుంటుంది. మన ఊరు బాగుంటే.. జిల్లా బాగుంటుంది. జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అంతే కానీ… డైరెక్ట్ గా దేశాన్నే ఉద్ధరించాలని పోతే.. మరి రాష్ట్రాన్ని ఎవరు చూసుకోవాలి.. ఇదిగో ఇదే ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల్లో కలుగుతున్న అనుమానం. రాష్ట్రాన్ని వదిలేసి దేశ రాజకీయాలు అంటూ పట్టుకొని తిరిగితే.. రాష్ట్రంలో ఉన్న పార్టీ పాపులారిటీ కాస్త తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా కొన్ని పార్టీలు యోచిస్తున్నారు. చాలా ప్రాంతీయ పార్టీలు తమ సొంత లాభం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలతోనే జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి కానీ..

Advertisement
who will come with cm kcr for national party
who will come with cm kcr for national party

KCR : అయితే కాంగ్రెస్.. లేదా బీజేపీ అంటున్న ప్రాంతీయ పార్టీలు

ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని పెడితే మాత్రం ప్రాంతీయ పార్టీలు ఎందుకు అంగీకరిస్తాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడారు. అందరూ కేసీఆర్ కు మద్దతు ఇచ్చినట్టుగానే మాట్లాడినప్పటికీ.. ఆచరణలోకి వచ్చేసరికి ఎంతమంది చేరుతారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు కేసీఆర్ కొత్త పార్టీ వైపు ఎంత మంది మొగ్గు చూపుతారు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కానీ… ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానీ.. జనసేన కానీ.. కేసీఆర్ పార్టీకి మద్దతు పలుకుతారా? తమిళనాడులో డీఎంకే పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీ వైపే చూస్తున్నాయి. కేరళలోనూ కష్టమే. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కష్టమే. ఒక్క కర్ణాటక నుంచి జేడీఎస్ పార్టీ మాత్రం కేసీఆర్ పార్టీతో జతకట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. జేడీఎస్ అటు కాంగ్రెస్ తో కానీ.. ఇటు జేడీఎస్ తో కానీ జత కట్టే అవకాశాలు లేవు. కాబట్టి జేడీఎస్ అధినేత కుమారస్వామి ఖచ్చితంగా కేసీఆర్ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. సీఎం కేసీఆర్ పార్టీ పెడితే ఎవరు ముందుకు వస్తారో?

Advertisement